Home రాష్ట్రీయ వార్తలు మహానాడు వేడుక… మహానటుల వేదిక

మహానాడు వేడుక… మహానటుల వేదిక

విజయవాడలోని సిద్ధార్ధ కళాశాల గ్రౌండ్‌ వేదికగా తెలుగుదేశంపార్టీ మూడురోజుల మహానాడు వేడుక ముగి సింది. తెలుగుదేశంపార్టీకి మహానాడు అంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ. స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక పథకాలకు గాని, పార్టీ కార్యక్రమాలకు గాని ఎంతో అద్భుతమైన తెలుగుపేర్లు పెట్టేవాడు. ఆయన పార్టీ వార్షికోత్సవ వేడుకకు పెట్టిన పేరే మహానాడు.

మహానాడులో ఊకదంపుడు ఉపన్యాసాలే కాదు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే తెలుగు పిండి వంటలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన పార్టీ కార్య కర్తలను ఆనందపరిచేవాళ్ళు.

సిద్ధార్ధ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన మహానాడుకు ఏపిలోని 13జిల్లాల నుండే కాకుండా తెలంగాణ నుండి కూడా కార్య కర్తలు తరలివచ్చారు. అయితే ఈ మహానాడులో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ఆత్మపరిశీలన జరగకపోగా చరద్రబాబు భజనకు ఎక్కువ సమయం కేటాయించారు. ఆయన పరిపాలన అమోఘంగా ఉందంటూ అఘోరించారు. ఈ నాలుగేళ్ళలో ప్రభుత్వ వైఫల్యాలపై విశ్లేషణ జరగలేదు. కార్యకర్తల సమస్యలను ప్రస్తావించలేదు. ఈ నాలుగేళ్ళలో ఒరిజినల్‌ తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది తీవ్ర నిరాశకు లోనై వున్నారు. కొత్తగా చేరిన కాంగ్రెస్‌, వైసిపి నాయకులకు పదవుల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. పాతికేళ్ళు, ముప్ఫై ఏళ్ళ నుండి పార్టీ జెండాలు మోసిన వాళ్ళను పక్కకు తోసేసారు. వాళ్ళకు పార్టీ నుండి ఎటువంటి భరోసా లభించలేదు.

ఈ మహానాడులో కొత్తగా కనిపించిన విషయం కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం. ప్రత్యేకహోదా అక్కర్లేదు, ప్రత్యేకప్యాకేజీ ఇస్తే చాలని చెప్పిన నోటితోనే ప్రత్యేకహోదా ఇవ్వట్లేదని చెప్పి బీజేపీని తిట్టారు.

ఇక మహానాడులో ప్రతిపక్ష నేత జగన్‌ను తిట్టడం, ఆయన లక్షకోట్లు తిన్నాడని చెప్పి అరిగిపోయిన రికార్డ్‌ను వేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ మహానాడు లోనూ అదే జరిగింది. మహానాడు వేదికపై తెలంగాణకు చెందిన నర్సిరెడ్డి అనే నాయకుడు, అలాగే ఎంపీ జె.సి. దివాకర్‌రెడ్డిలు జగన్‌పై చౌకబారు విమర్శలు, పిట్టకథలు చెబుతుంటే వాటిని వింటూ పగలబడి నవ్విన చంద్రబాబు, ఇతర నాయకుల తీరు వెగటు పుట్టించేలా వుంది.

అన్నింటికి మించి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థు లుగా, ఫ్యాన్‌ గుర్తు మీద గెలిచి ప్రలోభాలతో తెలుగుదేశంలో చేరిన ముగ్గురు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ పిట్టకథలను విని నవ్వుతుంటే చూసేవారికి ఎంతో రోతనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here