Home జాతీయ వార్తలు మరో సక్సెస్‌ కోసం… షార్‌ సిద్ధం

మరో సక్సెస్‌ కోసం… షార్‌ సిద్ధం

నవంబర్‌ 14వ తేదీన జిఎస్‌ఎల్‌వి మార్క్‌3-డి2ను విజయవంతంగా ప్రయో గించిన ఇస్రో, ఆ తర్వాత 15రోజులకే 29వ తేదీన పిఎస్‌ఎల్‌వి-సి43ని నింగి లోకి పంపి విజయం సాధించింది. ఈ ప్రయోగం జరిగిన 20రోజులకే మరో ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ ముస్తాబైంది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌11ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్‌ ద్వారా 2,250 కిలోల బరువు గల కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌ -7ఏను కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఒకప్పుడు నెలల గ్యాప్‌లో రాకెట్‌ ప్రయోగాలు జరిగేవి. ఇప్పుడు వారాలలోకి వచ్చాయి. త్వరలో రోజుల తేడాలోకి ప్రయోగాలు రావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here