Home జాతీయ వార్తలు మరో గగనయాత్ర

మరో గగనయాత్ర

అంతరిక్షానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎనలేని అనుబంధం ఏర్పడినట్లుంది. ఇస్రో వాళ్ళు నెలకు రెండు రాకెట్లు పంపుతున్నా అంతరిక్షం ఎంతో ఓపికగా ఆ రాకెట్ల ద్వారా వచ్చిన ఉపగ్రహాలను తన కౌగిలిలో ఇముడ్చుకుంటోంది.

ఈ పరంపరలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగం జరిపింది. ఇస్రోకు అత్యంత నమ్మకమైనదిగా ముద్రపడ్డ పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో మరో ప్రయోగం జరిగింది. ఈ నెల 24వ తేదీ రాత్రి 11.37 గంటలకు నెల్లూరుజిల్లా శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి44 నింగిలోకి దూసుకుపోయింది.

సరికొత్త ప్రయోగం…

ఇస్రో చరిత్రలో ఇదో సరికొత్త ప్రయోగం. రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లతోనే ఈ ప్రయోగం జరిపారు. దీనిద్వారా ఖర్చు తగ్గించారు. రెండు తేలికపాటి ఉపగ్రహాలు… తమిళనాడు హైస్కూల్‌ విద్యార్థులు రూపొందించిన కలాం శాట్‌, మైక్రోశాట్‌-ఆర్‌ అనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ రాకెట్‌ను రెండుసార్లు ప్రయోగాత్మకంగా రీస్టార్ట్‌ చేయనున్న దృష్ట్యా ప్రయోగం పూర్తికావడానికి 15గంటల సమయం పట్టింది. ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ పర్యవేక్షణలో ఈ ప్రయోగం విజయవంతమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here