Home జిల్లా వార్తలు మనుషులు కలిశారు.. మనసులు కలిసేనా?

మనుషులు కలిశారు.. మనసులు కలిసేనా?

ప్రపంచంలో ఏడు వింతల గురించి చెప్పుకుం టుంటారు. ఆ వింతలనేవి శాశ్వ తంగా వుంటాయి. కాని, రాజకీయాలలో తాత్కాలిక వింతలు ఏర్పడుతుంటాయి. ఆ వింతలు చూడడానికి ఎంతో అద్భుతంగా వుంటాయి.

ఇప్పుడు ఇలాంటి అద్భుతాలే నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీలో చోటుచేసు కుంటున్నాయి. ఒకే కారులో పక్కపక్క సీట్లలో నిన్నటివరకు నిప్పు-ఉప్పులా వున్న మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, అలాగే ఒకే సభలో పక్కపక్క సీట్లలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి – ఆదాల ప్రభాకర్‌రెడ్డిల మంతనాలు…. వీళ్ళ ముగ్గురు కూడా నాలుగున్నరేళ్ళుగా ఒకరంటే ఒకరికి పడదన్నట్లుగా వున్నారు. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి కలిసిపోయారు. ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు కూడా పోటీ చేస్తున్నారు. ఒకరి అవసరం ఒకరికి వుంది. నెల్లూరు నగరంలో నారాయణకు అటు సోమిరెడ్డి, ఇటు ఆదాల మనుషులు పనిచెయ్యాలి. నెల్లూరురూరల్‌లో సోమిరెడ్డి వర్గం ఆదాలకు చెయ్యాలి, సర్వేపల్లిలో ఆదాల వర్గం సోమిరెడ్డికి చెయ్యాలి. ఈ పరస్పర అవసరం దృష్ట్యానే ఒకరికొకరు స్నేహంగా వుంటున్నారు. ఈ స్నేహం ఎన్నికల్లో కూడా పనిచేస్తుందేమో చూద్దాం!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here