Home జిల్లా వార్తలు మండే సూర్యుడు..

మండే సూర్యుడు..

మండుతున్న సూర్యుడు ధాటికి జిల్లా ప్రజానీకం అల్లాడుతున్నారు. ఒకప్రక్క రాజకీయ ప్రచార వేడి రోజురోజుకు ఎక్కువవుతుంటే తట్టుకుని పార్టీల నాయ కులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. గత నెల చివరి వారంలో ఎండ తీవ్రత ఎక్కువైంది. ఒక్క సారిగా 2.5 డిగ్రీలు పెరిగాయి. గత నెల 27వతేది 37డిగ్రీలు, 28న 36.8 డిగ్రీలు, 29న 36.5 డిగ్రీలు, 30న 38.5 డిగ్రీలు, 31న 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత లతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రూరల్‌ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు కరెంట్‌ పోవడం వల్ల ఉక్కపోతకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. చంటిబిడ్డలు, చిన్నపిల్లల గురించి ఇక చెప్పనవసరం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 3 నుండి 4 డిగ్రీలకు పైగా అధికంగా గ్రీష్మతాపం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. మార్చి నెల నుండే ఎండ తీవ్రత ఎక్కువైంది. ఈ నెలాఖరులోగా ఎండ తీవ్రత ఎక్కువయ్యే అవకాశం వుందని, వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల ఉష్ణో గ్రతలు అధిక మయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉదయం 8గంటల నుండే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 5 గంటల దాకా ఎండలు తగ్గడం లేదు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నయోదు అయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్ర మత్తంగా వుండాలని వాతావరణ శాఖ, విపత్తుల నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు గాని, టోపిగాని ఉపయో గించాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మంచి నీళ్ళు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here