Home రాష్ట్రీయ వార్తలు బెంబేలెత్తుతున్న బాబు

బెంబేలెత్తుతున్న బాబు

పసుపు – కుంకుమ ప్రభంజనం సృష్టిస్తుందనుకున్నాడు… పంచిన పింఛన్‌లు ఓట్లను పెంచుతాయనుకున్నాడు… కేంద్రం ఇచ్చిన దాంతో కలిపి ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ ఆర్ధిక సాయం రైతుల చేత జైకొట్టిస్తుందనుకున్నాడు… కాని ఆయన ఒకటి తలిస్తే, రాజకీయ దైవం ఒకటి తలుస్తోంది. డ్వాక్రా ఋణాల మాఫీ అని వాగ్ధానం చేసి, తీరా గద్దెనెక్కాక ఆ మాటే మరచిన చంద్రబాబును పసుపు-కుంకుమ ఇవ్వగానే

మహిళలు నమ్ముతారా?

మీ ఋణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం, మీరొక్క నయాపైసా కట్టొద్దు అంటూ ఓట్లే యించుకుని, తీరా అధికారంలోకి వచ్చాక అరకొర ఋణమాఫీ చేసి, ఇదేంటని అడి గితే దబాయింపులకు దిగిన చంద్రబాబును అన్నదాతలు నమ్ముతారా? ప్రజాసంకల్ప పాదయాత్రలో వైసిపి అధికారంలోకి రాగానే వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్‌లను రెట్టింపు చేస్తానన్న జగన్మో హన్‌రెడ్డి హామీని కాపీ కొట్టి, ఇప్పటికి ప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం దానిని అమలు చేసిన చంద్రబాబు చిత్తశుద్ధిని పింఛన్‌ల లబ్దిదారులు విశ్వసిస్తారా?

అసలు వీళ్ళే కాదు… చంద్రబాబు నాయకత్వాన్ని, నిలకడలేని తత్వాన్ని తెలుగుదేశం పార్టీలో వుంటున్నవాళ్ళే నమ్మడం లేదు. అందుకే మాటమీద నిల బడేతత్వం, విలువలతో కూడిన రాజకీ యాలు చేస్తున్న వైసిపి అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డిని నమ్ముతున్నారు. అందుకే వైసిపి వైపు నడుస్తున్నారు.

తాను విసిరిన తాత్కాలిక తాయిలా లతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు తనకు అనుకూలంగా మారుతున్నాయని, ప్రజల్లో తన పట్ల ఆదరణ పెరుగుతోందని, వైసిపి నుండి కూడా టిడిపిలోకి వలసలుం టాయని చంద్రబాబు భావించాడు. అయితే ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. టిడిపిలో వున్న బలమైన నాయకులు ఆ పార్టీని వదిలి జగన్‌ నాయకత్వంలో వైసిపిలో చేరుతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఈ వలసలకు బీజం వేశాడు. ఆమంచిని పార్టీలో నిలుపుకుందా మని చేసిన చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. ఆమంచి తర్వాత అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్‌, అమలాపురం ఎంపి రవీంద్రబాబు, విజయవాడకు చెందిన విజయ ఎలక్ట్రికల్స్‌ అధినేత దాసరి జైరమేష్‌ వంటి గట్టి నాయకులు, మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపిలోకి వచ్చారు. ఇంకా టిడిపికి చెందిన పలు వురు ముఖ్య నాయకులు వైసిపిలోకి రాబోతున్నారు.

కులతత్వంపై తిరుగుబాటా?

రాష్ట్ర రాజకీయాలలో కమ్మ, కాపు సామాజికవర్గాలకు సామాన్యంగా పడదు. కాపు వర్గం గతంలో కాంగ్రెస్‌తో వుండేది! మెగాస్టార్‌ కుటుంబం మూలంగా ఆ వర్గం కాంగ్రెస్‌కు దూరమైంది. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం మూలంగా కాంగ్రెస్‌కు దూరమైన కాపులు, 2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ కోసం తెలుగు దేశంకు దగ్గరయ్యారు. అయితే ఈ ఐదే ళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వంలో పేట్రేగి పోయిన కులతత్వాన్ని కాపు నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల దాకా ఎదురుచూశారు. ఇప్పుడు బయటపడు తున్నారు! తెలుగుదేశం నుండి మరి కొంతమంది నాయకులు వైసిపిలోకి వెళ్లే అవకాశాలున్నాయనే సమాచారం చంద్ర బాబులో కలవరం పుట్టిస్తోంది. మరికొం దరు నాయకులు పార్టీ వదిలి పోకుండా చేసేందుకు కట్టడిచేస్తున్నారు. కాని, రోజుకొకరు జెండా ఎత్తేస్తుండడంతో ఆయనలో ఆందోళన పతాకస్థాయికి చేరుతోంది. ఈ ఆందోళనతోనే పుల్వామా దాడి వెనుక మోడీ కుట్ర, ఉగ్రదాడికి మాకు సంబంధం లేదని పాకిస్థానే చెప్పింది అనే మాటలు మాట్లాడుతున్నాడు.

ఫలిస్తున్న విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిల కృషి

2014 ఎన్నికల్లో వైసిపి ఓటమికి కారణం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలే! ఈ జిల్లాల్లో వైసిపి బాగా బలహీనంగా వుండడం వల్లే అధికారానికి దూరంగా ఆగిపోయింది. ఈ జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలు తమ భుజాలకెత్తుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బాధ్యతలను విజయసాయిరెడ్డి చూస్తే, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలను వై.వి.సుబ్బారెడ్డి తీసుకున్నాడు. గత రెండేళ్ళుగా వీళ్ళు ఆ ఐదు జిల్లాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఒక సామాజికవర్గం నేతలను వైసిపికి చేరువ చేయడంలో విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here