Home జిల్లా వార్తలు బీజేపీతో ఎవరికో బీపీ

బీజేపీతో ఎవరికో బీపీ

బీజేపీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు జిల్లా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ పార్టీ ఒకే ఒకసారి ఒక శాసనసభలో విజయం సాధించింది. అది కూడా 1983లో అంతటి ఎన్టీఆర్‌ ప్రభంజనంలో కూడా ఉదయగిరి అసెంబ్లీ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్య నాయుడు విజయం సాధించి వున్నారు. 1978లో ఇదే ఉదయగిరి నుండి ఆయన జనసంఘ్‌ అభ్యర్థిగా గెలిచి వున్నారు. నెల్లూరు జిల్లాలో బీజేపీకి తొలిగెలుపు 1983లో ఉదయగిరిదే! మరి నేటి పరిస్థితులు చూస్తుంటే చివరి గెలుపు కూడా అదే అవుతుందా అనే అనుమానాలు రాకమానవు.

అయితే బీజేపీ గెలిచినా గెలవకున్నా ప్రతి నియోజకవర్గం లోనూ ఆ పార్టీకి అభిమానులున్నారు. కార్యకర్తలున్నారు. నియో జకవర్గాలను బట్టి 2వేల నుండి 10వేల వరకు ఓట్లు తెచ్చుకునే సామర్ధ్యం కూడా ఆ పార్టీకి వుంది. సొంతంగా బీజేపీ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ గెలవలేకపోవచ్చు. కాని, ప్రధాన పార్టీలను ప్రభావితం చేసే విధంగా ఓట్లు చీల్చగల అవకాశం మాత్రం ఆ పార్టీకి వుంది. 1983 నుండి కూడా నాలుగుసార్లు టిడిపితో పొత్తు పెట్టుకునే ఆ పార్టీ ఎన్నికలకుపోయింది. తెలుగుదేశం పొత్తు ఆ పార్టీకి ఎప్పుడూ కలిసిరాలేదు. ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. కనీసం సొంతంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసివున్నా… బీజేపీ వాళ్ళు తమ పార్టీకి తాము ఓట్లేసుకుంటుండేవాళ్ళు.

2014లో టిడిపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. ఆ పార్టీతో టిడిపి తెగదెంపులు చేసుకోవడం తెలిసిందే! వైసిపితో పొత్తుకు అవకాశం వుందిగాని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ప్రకటించకపోతే జగన్‌ ఆ పాపం చేయడు. ఏపికి ప్రత్యేకహోదాతో పాటు విభజన వరాలను కూడా మోడీ ఇచ్చేస్తే అప్పుడు బీజేపీ – వైసిపి పొత్తు పొడసూపే అవకాశముంది.

కాని, మోడీ అవేవీ ప్రకటించకపోతే బీజేపీకి ఒంటరి పోరాటం తప్పదు. అప్పుడు ఈ జిల్లాలోని 10 అసెంబ్లీలలోనూ బీజేపీ అభ్యర్థులు నిలబడతారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థి శక్తిని బట్టి ఓట్లు చీలుతాయి. బీజేపీ గనుక బలహీన అభ్యర్థులను రంగంలోకి దించితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కుండా వైసిపి లాభపడుతుంది. సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, పి.సురేంద్రరెడ్డి, దినేష్‌రెడ్డి లాంటి ఓ రకమైన గట్టోళ్లను దించితే వైసిపికి పడాల్సిన ఓట్లకు గండిపడే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here