Home జాతీయ వార్తలు బిజెపి జాతీయ కార్యదర్శిగా సత్య

బిజెపి జాతీయ కార్యదర్శిగా సత్య

ముందు ”సంఘ్‌” సేవ ఆ తరువాత పార్టీ సేవ, పార్టీ వేదికగా సంఘ సేవ… ఇదీ సత్య ప్రస్థానం. ”సత్య”గా అందరికీ సుపరిచితుడైన ఈయన అసలు పేరు ”సత్యకుమార్‌”. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి 23 సంవత్సరాలుగా తోడుగా నీడగా అన్నింటిని మించి ఆయన ఆత్మగా అంతరాత్మగా గల్లీ నుండి ఢిల్లీ దాకా భారతీయ జనతాపార్టీ శ్రేణుల్లోనూ వెంకయ్య ఆప్తుల్లోనూ గుర్తింపు పొందిన యువ మేధావి ”సత్యకుమార్‌”.

”సత్య” కార్యశూరుడు, కార్యదక్షుడు, కార్య సాధకుడు. తన గురువు వెంకయ్యలాగానే ఏ భాష అవసరమైతే ఆ భాష మాట్లాడుతూ ఇటు వెంకయ్యకు అటు పార్టీకి తనదైన శైలిలో సేవలందిస్తూ గుర్తింపు పొందాడు. ఎంతటి స్థాయి కార్యక్రమాన్నైనా అవలీ లగా జరిపించడంలోను, అత్యున్నత పదవులలో వున్న వ్యక్తులతోనైనా అలవోకగా మాట్లాడడంలోను సత్యకుమార్‌ దిట్ట.

యాదవ్‌ సత్యకుమార్‌ ఆయన పూర్తి పేరు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆయన జన్మస్థలం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ట్రిపుల్‌ ఇ పట్టా పొందాడు. మధురై కామరాజ్‌ యూనివర్శిటీ నుండి పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్‌ చేశాడు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్‌, చెన్నై నుండి యం.బి.ఏ అర్హత సాధించాడు. ఇక్కడితో ఆగలేదు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ, గీతం యూనివర్శిటీ నుండి పిహెచ్‌డిలను పొందే ప్రయత్నంలో వున్నాడు.

ఇక గత రెండున్నర దశాబ్దాల కాలంలో వెంకయ్య వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన వివిధ హోదాలలో పనిచేసినప్పుడు ఆయన పేషిలో ప్రత్యేక అధికారిగా సుదీర్ఘ అనుభవం వున్న వ్యక్తిగా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వ వ్యవహారాలలోనూ అత్యంత సమర్ధత కలిగిన వ్యక్తిగా చెరగని ముద్ర వేసుకున్నాడు.

2017వ సంవత్సరం సెప్టెంబర్‌ నుండి డిసెం బర్‌ వరకు భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక అధికారిగా పనిచేసి అనంతరం జనవరి 1, 2018 నుండి భార తీయ జనతాపార్టీ జాతీయ నాయకత్వం అప్పజెప్పిన వివిధ బాధ్యతలను తనదైన తరహాలో నిర్వర్తిస్తూ, ముఖ్యంగా ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల సమయంలో పార్టీలో తన ఉనికిపై చెరగని ముద్ర వేసుకున్నాడు.

సత్యకుమార్‌లో వున్న చురుకుతనాన్ని, ఆయనలో వున్న స్నేహబాంధవ్యాన్ని సేవాతత్వాన్ని, అంకిత భావాన్ని, క్రమశిక్షణని, అన్నింటికి మించి భారతీయ జనతాపార్టీ పట్ల వున్న విధేయతని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా నాయకత్వంలోని పార్టీ పెద్దలు సత్యకుమార్‌ని జాతీయ కార్యదర్శి పదవితో సత్కరించారు.

ఇది ఒక మంచి ఆరంభం. కడప జిల్లా వాడై నప్పటికీ వెంకయ్యతో వున్న అనుబంధం ద్వారా ఆయన నెల్లూరుకు దత్తపుత్రుడయ్యాడు. ఆయన పురోభివృద్ధి నెల్లూరీయులకు కూడా గర్వకారణమే. చిన్న వయస్సులో జాతీయ స్థాయి నాయకుల దృష్టిని ఆకర్షించి అతికీలక పదవిని చేపట్టిన ”సత్యకుమార్‌” భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి గరువును మించిన శిష్యుడిగా రాణించాలని ఆకాంక్షి స్తోంది ‘లాయర్‌’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here