Home జిల్లా వార్తలు బాలికలకు బడిబాట.. దేశ భవితకు బంగారుబాట

బాలికలకు బడిబాట.. దేశ భవితకు బంగారుబాట

కస్తూరిదేవి విద్యాలయం ఇప్పుడు బాగా విస్తరించింది కానీ, ప్రారంభకాలంలో విద్యాలయ స్థాపనకు విద్యాలయం నిర్వాహకులు పడిన కష్టాలు అన్నిన్ని కావు. బాలికలకు చదువెందునే ఆ రోజుల్లో బాలికలకు బడి పెట్టినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అటు స్వాతంత్య్ర సమరంలోనూ, ఇటు సమాజసేవలోనూ ఉంటూ సమాజాభ్యున్నతే ధ్యేయంగా నిలిచిన కొందరు మహనీయులు పట్టుబట్టి మరీ స్త్రీ విద్యకోసం తపించారు. ఒక్క బాలిక చదువుకుంటే వివాహమయ్యాక ఆ స్త్రీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా సమాజానికీ ప్రయోజనం కలుగుతుంది..మొత్తంగా దేశానికి పురోగతి వస్తుందనే దృఢసంకల్పం వారిది. బాలికలు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తుకే కాక, సమాజ భవితకు కూడా మార్గం ఏర్పడినట్లవుతుందని తెలిసిన సమాజసంఘసంస్కర్తలైన ఆ మహనీయులు ఎన్నో అవస్తలు పడి.. ఏర్పరచిన మార్గమిది. పేద బాలికల చదువుకు నాటి మహానుభావులు చూపిన ఆ బడిబాటే నేడెందరో బాలికలకు బంగారుబాటగా మారింది.

కస్తూరిదేవి విద్యాలయం ప్రారంభం నుంచి అన్నీ కష్టాలే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కష్టాల సుడిలోంచేే పాఠశాల ఆవిర్భవించింది. ఎన్నెన్నో ఒడిదుడుకులతో ఈ సంస్థ ప్రారంభమైనా, విద్యా లయం నెలకొల్పాలనుకుని స్థిర నిర్ణయంతో పాటుపడుతున్న వారు స్వాతంత్య్రసమరంలో జైలుపాలైనా వారు అకుంఠిత దీక్షతో విద్యాలయం ఏర్పాటుకు చేసిన కృషి ఏనాటికీ మరువ లేనిది. ఎప్పటికప్పుడు సమస్య లన్నిటినీ అధిగమిస్తూ ధీరో దాత్తంగా వారు ముందుకు సాగేవారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉండేవారు. అలా అందరూ కలసి నిరంతర కృషి సాగిస్తున్న తరుణంలో.. మధ్యలో ఒక దురదృష్టకర ఘటన వారికి ఎంతో బాధ కలిగించింది. విద్యాలయం ఏర్పాటు చేయాలను కున్న తొలినాళ్ళ నుంచి ఈ కమిటీలో కీలకపాత్ర పోషిస్తూ అప్పట్లో ఈ విద్యాలయం అభివృద్ధికి ఎంత గానో కృషిచేస్తున్న మహనీయుడు శ్రీ రాళ్ళపల్లి రామ సుబ్బయ్యగారు పరమపదించడం. ఆయన ఆకస్మిక మరణం అందరినీ ఆవేదనకు గురిచేసింది. 1931 జూన్‌ 23వ తేది ఉదయం జరిగిన కమిటీ సమావేశంలో శ్రీమతి పొణకా కనకమ్మగారు, శ్రీయు తులు బెజవాడ గోపాలరెడ్డి గారు, రేబాల పట్టాభిరామిరెడ్డి గారు, కె.వి రాఘవాచార్యులు గారు పాల్గొని రాళ్లపల్లివారి మరణానికి తమ ప్రగాఢ సంతా పాన్ని తెలియజేశారు. ఇలా అన్నిరకాల వేదనలు, కష్టాల ముళ్ళనూ.. కన్నీటి వాగుల్ని దాటుకుంటూ.. ఈ విద్యాలయం అభివృద్ధిపథం వైపు ముందుకు సాగిందంటే నాటి మహనీయుల చిత్త

శుద్ధి… కర్తవ్యనిర్వహణలోని దీక్షాదక్షతలే కారణం.

వదాన్యుల చేతిచలువతోనే విద్యాలయం నిర్వహణ!

ఆ రోజుల్లో బడి పెట్టడమంటే మాటలు కాదు. విద్యాలయం నిర్వహణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయినా, సింహపురి వదాన్యుల సహకారం, వారి చేతిచలువతో విద్యాలయం అన్ని కష్టాలను అధిగమిస్తూ వస్తోంది. మరోవైపు ప్రజల ఆశీస్సులు విద్యాలయ కార్యకర్తలను మరింత ఉత్సాహంతో ముందుకు నడిపించాయి. ఇదిలా వుంటే, ఆడపిల్లలకు చదువు ఎందుకనుకునే నిరాశలో ఉన్న పేదకుటుంబాల వద్దకు వెళ్ళి వారి పిల్లలను బడిలో చేర్పించేందుకు వారి తల్లిదండ్రు లకు, కుటుంబసభ్యులకు తమ పిల్లల చదువు పట్ల అవగాహన కల్పించడం మరో పెద్ద కార్యక్ర మమైంది. ఆ కర్తవ్యాన్ని కూడా వారే ఎంతో దీక్షతో బాధ్యతతో నిర్వహించడం విశేషం!

కృషితో నాస్తి దుర్భిక్షమ్‌.. అన్నట్లుగా చివరికి వారి కల సాకారమైంది. బాలికల చదువుకు పాఠశాల ఏర్పాటు చేయాలనే సంకల్పం నెరవేరింది. తొలుత బడికి వచ్చేందుకు బాలికలకు ఆసక్తి లేకపోయినా, ఆ మహనీయుల నిస్వార్ధ కృషి ఫలితంగా 1944 జులై 16వతేదీన ‘శ్రీ కస్తూరి దేవి బాలికల హైస్కూల్‌’ ప్రారంభమైంది. ఒకరిద్దరి బాలికల రాకతో ప్రారంభమైన ఆ బడిలో 1945 నాటికి విద్యార్థినుల సంఖ్య 47కు చేరింది. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. 1945-46వ సంవత్సరం వచ్చే సరికి ఆ సంఖ్య 106కు పెరిగింది. అదేవిధంగా, 1946-47లో 253 మంది, 1948-49లో 276 మంది విద్యార్థినులు ఈ హైస్కూల్లో చేరి విద్యను అభ్యసించారు. ఒకవైపు ఆనందం.. మరోవైపు ఆర్థి కంగా కష్టం. బాలికలు బడికి బాగా వస్తున్నారనేది సంతోషమైతే, బాలికల సంఖ్య పెరిగే కొద్దీ నిర్వహణ కూడా మరింత వ్యయభారమైంది. 1944-45లో 2,729 రూపా యలున్న లోటు, 1948-49 నాటికి 16,785 రూపాయలకు చేరుకుంది. ఈ మొత్తం అప్పట్లో చిన్నదేమీ కాదు. ఇప్పటితో పోల్చుకుంటే లక్షల్లోనే ఉం టుంది. అయినా, ఏమాత్రం తొణక్కుండా బెణక్కుండా ఆ మహానుభావులందరూ అవి శ్రాంత కృషి చేయడం వల్లే ఈ విద్యాలయం పునాదులు అంత గట్టిగా ఉండి నేటి అభివృద్ధికి బంగరుబాటలు వేశాయన్నది గమనించా ల్సిన విషయం.

ఇలా ఎంతోమంది ప్రజల సహాయసహకారాలతో, వదాన్యుల ఔదార్యంతో.. కొంత ప్రభుత్వ గ్రాంట్‌తో అప్పట్లో ఈ విద్యాలయం నడిచేది.

1951లో మొల్లమాంబ గ్రంథాలయానికి శిలాఫలకం

నాటి స్వాతంత్య్రయోధులకు చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉండేదన్నది అందరికీ విదితమే. బాలికలు జాతీయభావాలతో రాణించాలంటే మంచి పుస్తకాలు వారికి అందుబాటులో ఉండాలి. అటు పాఠ్య పుస్తకా లతో పాటు ఇతరత్రా గ్రంథాలు కూడా వారికి చేరువ చేసి వారిలో సమాజం పట్ల, దేశం పట్ల మంచి అవగాహన కలిగించాలి. ఈ సంకల్పంతో కస్తూరి దేవి విద్యాలయంలో ఒక చక్కటి గ్రంథాలయం

కూడా రూపుదిద్దాలని నిర్ణయించుకున్నారు.

సమాజంలో స్త్రీలు చదువు కోవడం దండగనే అభిప్రా యాలు జోరుగా ఉండే ఆ రోజుల్లో ఇక అక్షరజ్ఞానం లేకుండా చదువెలా సాగు తుంది?.. స్త్రీలకు చదువన్నా, ఇతర గ్రంథాలు చదువుకోవా లన్నా వారికి ఎక్కడా ఎలాంటి అవకాశాలు ఉండేవి కావు. అయితే ఈ కాలంలోనే కాదు.. అంతకుముందు నాటి కాలంలో స్త్రీల పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఆడవారికి, బాలికలకు నాటి సమాజంలో అన్నీ ప్రతిబంధకాలే. అయినప్పటికీ ఆ దుస్థితులన్నిటినీ ధీరోదాత్తంగా అధిగమించి చదువుకోవడమే కాకుండా.. అత్యద్భుత మైన కవితా ప్రతిభతో రాణించి..రామాయణాన్ని సరళసుందరమైన భాషలో రచించి రామాయణ రచయిత్రిగా లోకవిఖ్యాతి పొందిన మహాకవయిత్రి మొల్లమ్మ అందరికీ ఆదర్శం. అందుకే, ఆ మహ నీయురాలిని స్మరించుకుంటూ.. ఎంతో విజ్ఞతతో నాటి పెద్దలు కస్తూరిదేవి విద్యాలయంలోని గ్రంథాలయానికి ‘మొల్లమాంబ గ్రంథాలయం’ అని నామకరణం చేసి ఆ మేరకు 1951 జనవరి 5వ తేదిన అప్పటి మద్రాసు గవర్నర్‌ భావ్‌నగర్‌ మహారాజా దంపతులను ఆహ్వా నిస్తే.. వారు అందుకు సంతోషంగా అంగీకరించి నెల్లూరుకు విచ్చేశారు. మహాత్మాగాంధీజీ ఆశీస్సులతో మాతా కస్తూరిదేవి పేరుతో ప్రారంభమైన ఈ విద్యాలయం పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున తాము సహకరిస్తామని వారు ఆ సందర్భంలో మాటిచ్చారు.

ఆ గ్రంథాలయ నిర్మాణానికి నాటి మద్రాసు గవర్నర్‌ మహారాజ భావ్‌నగర్‌, మహారాణి భావ్‌నగర్‌ల చేతుల మీదుగా శంకుస్థాపన చేయిం చడం ఎంత గొప్ప విశేషమో!.. ఈ గ్రంథాలయం ప్రారంభించే నాటికి కస్తూరిదేవి విద్యా లయంలో చదువుకుంటున్న బాలికల సంఖ్య నాలుగువంద లకు చేరిందంటే చూడండి.. ఎంత గొప్ప సామాజికమైన మార్పో!.. . కృషి ఉంటే మను షులు రుషులవుతారన్నట్లుగా ఆ మహానుభావుల సంకల్ప బలం సింహపురి సీమలోని బాలికల జీవితాలకు బంగారుబాటలు వేసిందంటే ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.

నాటి మహనీయులు సమాజసేవా దృక్ఫధంతో చేసిన ఆ బృహత్తర కార్యాలన్నీ వారికే కాదు.. సింహపురీయులందరికీ గర్వకారణమైన విషయాలు. ఇవన్నీ కస్తూరిదేవి విద్యాలయానికి సంబంధించిన పూర్వకథలోని..అపూర్వ విషయాలేనని వేరే చెప్ప నక్కర లేదు.

కస్తూరిదేవి బాలికల కోసం హాస్టల్‌ కూడా ప్రారంభం

పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య పెరగడంతో, బాలికలను వారి ఇళ్ళ వద్దనుంచి క్రమం తప్పకుండా వేళకు వారిని బడికి తీసుకువచ్చేందుకు ఈ పాఠశా లకు అప్పట్లోనే ప్రత్యేకించి ఒక మోటార్‌ వ్యాను కూడా ఉండేదంటే బాలికల విద్య పట్ల ఆ సంఘసేవకులు ఎంతగా శ్రద్ధ చూపేవారో తేట తెల్లమవుతుంది. అప్పట్లోనే 40వేల రూపాయలు వెచ్చించి ఈ పాఠశాలకు అనుబంధంగా వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో విశేషం. దీంతో ‘కస్తూరిదేవి బాలికల హాస్టల్‌’లో విద్యార్థినుల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతూ వచ్చింది. స్త్రీవిద్యాభ్యున్నతికి ఈ వసతులన్నీ రాచబాటల య్యాయి. తొలుత 12 మంది మాత్రమే ఉన్న ఈ హాస్టల్‌లో 1944 నాటికే ఆ సంఖ్య 40కి దాటడం ఆ కాలంలో ఎంతైనా ఆశ్చర్యకరమే మరి!.. ముఖ్యంగా నిరుపేద దళితులు, అభాగ్యులైన బాలికలతో పాటు స్థానిక కళశాలల్లో చదువుకుంటున్న పేద బాలికలు కూడా ఈ వసతిగృహంలో ఉండి చదువుకునేందుకు వీలు కల్పించారు. బాలికలందరికీ ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలు బాగా ఉండేవి. ఆ తర్వాత, 1948లో విద్యాబోధనలో మరింత ముందుకు సాగుతూ, ప్రధానంగా హోం సైన్స్‌ సబ్జెక్ట్‌తో పాటు, చిత్రలేఖనం, పెయింటింగ్‌లలో కూడా విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేవారు. అందుకోసం ప్రత్యే కంగా ఒక ఆర్ట్‌ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు.

ఈ పాఠశాలకు ఒక గదిలో ఓ పుస్తకాల గది అన్న ట్లుగా గ్రంథాలయం ఉండేది. దానిని కూడా బాగా విస్తరింప జేసి బాలికలకు మరింతగా చదువుపట్ల ఉత్సాహం కల్పిం చాలని స్వాతంత్య్రసమర యోధురాలు.. ఈ విద్యాలయం స్థాపకురాలైన పొణకా కనకమ్మతో పాటు తిక్కవరపు రామిరెడ్డి వంటి వదాన్యులు.. వీరందరి ప్రేరణతో ఈ విద్యాలయానికి గ్రంథాలయం ఏర్పాటుకు కూడా సంకల్పించారు.

సంస్కారహీనమైన, అనగారికమైన, ఆటవికమైన, అసహ్యకరమైన వంటి పదజాలాలతో…

ఛీ… ఛీ ఇవేం రాతలు… ఇదేం జర్నలిజం…?

అయ్యా పాతపేపరు సంపాదకా… నీ పత్రికకు 80 సంవత్సరాల చరిత్ర వుందని, మీ తాతలు నేతులు తాగారని చెప్పుకుంటూ మూతులు తుడుచుకుంటున్న నువ్వు, ఈ పత్రిక నీ చేతుల్లోకి వచ్చాక ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఊహించుకో. నీచాతినీచమైన పదజాలంతో నీవు చేసే జర్నలిజం, వ్యక్తులపై ఘోరంగా విమర్శలు చేసే నీ శాడిజం చూసి యావత్‌ పత్రికా రంగమే సిగ్గుతో తలదించుకుంటోంది. ఘనకీర్తి కలిగిన నెల్లూరుజిల్లా స్థానిక చిన్న పత్రికల చరిత్రకే మచ్చ ఏర్పడింది.

నీతో బాగుంటే, నువ్వడిగింది చేస్తే, నీ కోరికలు తీర్చి నీ ధనదాహానికి దాసోహం అంటే ఎంతటి వారినైనా ఆకాశానికి ఎత్తి, అందలం ఎక్కిస్తావు. నీ దుర్మార్గాల గురించి, నువ్వు చేస్తున్న తప్పుల గురించి వాళ్ళు ఎత్తి చూపిస్తే వెంటనే నీ గలీజు రాతలతో వారిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తావు.

2001లో జి.వి.కె.రెడ్డి కస్తూరిదేవిని కాజేయాలని చూశాడని… నువ్వేదో పెద్ద సంఘసంస్కర్తలా అడ్డుకున్నావని బాకాలు కొట్టుకుంటున్నావు. ఆరోజు నుండి కస్తూరిదేవి సభ్యుడిగా కొనసాగుతుండిన జి.వి.కె.రెడ్డికి 2011లో పద్మభూషణ్‌ వస్తే ఏ స్థాయిలో ఆయనను కీర్తించావో మర్చిపోయావా…? అప్పులు ఎగ్గొట్టి బ్యాంకులను దివాళా తీయించారని ఆయనపైన ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు. ఎగ్గొట్టడాలు, దివాళా తీయించ టాలు నీకున్న గుణాలు. అవి ఇతరులలో ఎత్తి చూపే అర్హత నీకుందా..?

వాడూ, వీడూ కూలిగాళ్ళు అంటూ పత్రిక భాషకి కొత్త అర్ధాలు చెప్పి నీ పేపరును ఒక కరపత్రం కంటే హీనస్థాయికి దిగజార్చిన సంస్కారం నీది. కార్పొరేట్‌ కంపెనీలలో వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయిలో పనిచేసే వ్యక్తు లను బౌన్సర్‌లతో పోల్చి కార్పొరేట్‌ కల్చర్‌ అంటే తెలియని కార్పొరేషన్‌ కుప్పతొట్టి స్థాయి నీది. నీ పేపరులో వచ్చిన వార్తకి ఖండనని ప్రకటన రూపంలో అచ్చువేసి డబ్బులు గుంజిన సంస్కృతి నీది. ప్రజలు అన్నీ చూస్తున్నారు, క్షుణ్ణంగా గమనిస్తున్నారు.

నువ్వు, నీ భజన బృందర కళ్ళు తిరిగేలా కస్తూరిదేవి విద్యాలయ సంస్థలని జి.వి.కె.రెడ్డి, జె.వి.రెడ్డి, దొడ్ల శేషారెడ్డి, మాగుంట పార్వతమ్మలాంటి వాళ్ళు అభివృద్ధి చేసి చూపించిన రోజు ఇదే ప్రజలు నీకు, నీ బృందానికి బుద్ది చెపుతారు. నువ్వు ఏ ఉద్దేశ్యంతో, ఏ స్వార్ధంతో ఇవన్నీ చేస్తున్నావో వాళ్ళు తెలుసుకుంటారు.

ఏ పత్రిక గొప్పదన మైనా ఆ పత్రిక రాసే భాషపై ఆధారపడి ఉం టుంది. విమర్శలు చేసే సందర్భంలో అవి సద్విమ ర్శలుగా ఉండాలి.. పది మందినీ అవి ఆకట్టుకోగల గాలి. అప్పుడే ఆ పత్రిక ప్రజాభిమానం చూరగొం టుంది. అలా కాక, పత్రిక పెట్టాము కదా అని బెది రింపు ధోరణితో, బ్లాక్‌మెయి లింగ్‌ చేస్తూ అసహ్యకరమైన, అవమానకరమైన, అభ్యంతరకరమైన

భాష వాడితే అది ఆ పత్రికకున్న ‘అసలు స్వరూపం’ బయటపెట్టు కున్నట్లవుతుంది. ఇప్పుడు మీ వైపు నుంచి జరుగుతున్నది ఇదే. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను ముఖ్యంగా ధనికవర్గాలను, ప్రతిష్టాత్మక కుటుంబాలవారిని సైతం బెదిరింపు రాతలతో భయపెడుతూ, వారిని అవమానించే రాతలు రాస్తూ.. వారిపట్ల మీకున్న అక్కసు తీర్చుకుంటున్న వైనం చూస్తే.. ఒకప్పట్లో ఎంతో గొప్పచరిత్ర గలదని మీరు గొప్పలు చెప్పుకుంటున్న పత్రిక..’ఇప్పుడు మరీ ఇంత ఘోరంగా తయారైపోయిం దేమిటబ్బా’…అని నెల్లూరీయులు విస్తుపోతున్నారు. ఇంత గబ్బురాతలు గతంలో ఎవరూ ఏ పత్రికలోనూ చూసివుండరు కూడా. నోటికొచ్చినట్లు ఆ రాతలేమిటి?..ఆ అసహ్యపు వ్యాఖ్యలేమిటి?..ముందు ఆ భాష మార్చుకోండి. అలాంటి నీచమైన భాషను పత్రికల్లో వాడడం ఎంతవరకు సమంజసం?… మీకైనా చదవడానికి సిగ్గుగా ఉండడం లేదా?…మీ స్వార్ధప్రయోజనాల కోసం.. సమాజంలో గౌరవంగా బతికేవారిని కూడా రచ్చకీడ్చి మీ విషపురాతలతో జనాన్ని ఎంతకాలం భయపెడతారు?.. ప్రజాస్వామ్యానికి పత్రికలు పట్టుగొమ్మలుగా ఉండాలి. కానీ ఆ పత్రికలు మీలా పక్కదారి పట్టగూడదు. ఇప్పుడు తమరి చేతుల్లో పడ్డాక పత్రిక అసలైన పాత్రికేయాన్ని వదిలేసిందా అనిపిస్తోంది. మీ అబద్దపు రాతలతో, వ్యక్తుల మీద కక్షపూరిత వ్యాఖ్యలతో, వ్యక్తిగత విమర్శలతోనే ‘కాలమ్‌’ గడుపుకుంటూ పోతోందా అనిపిస్తోంది. ఒక పత్రికను ఎంతగా భ్రష్టుపట్టించ వచ్చో తెలుసుకోవాలనుకునేవారికి మీ పత్రికే ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. ఇంతకన్నా మీకెవరైనా చెప్పేదేమీ ఉండదు. ‘మా పత్రిక మా ఇష్టం.. మేమేదైనా సరే ఇట్లాగే రాస్తాం’ అంటే..ఎవరైనా ఇక చేసేదేమీ ఉండదు.

అయ్యా… అక్కుపక్షీ!….

నీలా నీచపు వ్రాతలు వ్రాయలేని నేను

నిరక్షర కుక్షినే!

అయ్యా అక్షర శూరుడా!… నీకు గతంలోనే చెప్పాను, నువ్వు ఓ అంశం(కస్తూరిదేవి విద్యాలయం)పై కథనాలు రాస్తున్నావు. నీ అబద్ధపు రాతల భాగోతాన్ని ‘లాయర్‌’ వెలుగులోకి తెస్తోంది. మధ్యలో విషయాన్ని ప్రక్కదోవ పట్టించి విగ్రహాలూ, సన్మానాలూ అంటూ వ్యక్తిగత దూషణకు దిగావు. ఇది సబుబ కాదని సున్నితంగా చెప్పాం. కానీ నువ్వూ, నీ బుద్ధీ మారలేదు. మళ్ళీ ”నిరక్షర కుక్షి” అంటూ నాపై వెకిలి వ్యాఖ్యలు చేశావు.

అవును నేను ”నిరక్షర కుక్షి”నే. అసలైన జర్నలిజం సిగ్గుపడేలా నీచాతి నీచమైన వ్యాఖ్యలతో వార్తలు వ్రాయడం నీలాంటి ”అక్షరాస్యుడి” నైజం అయితే, అలా చేయలేని నేను నిరక్షరాస్యుడినే. నీతి, నియమం, నిబద్ధత తప్పి నైతిక విలువలను తుంగలో తొక్కి వార్తలు వ్రాయడం నీ దృష్టిలో అక్షరాస్యత అయితే అలా రాయలేని నేను నిరక్షర కుక్షినే!

అబద్దపు నిందలతో, అసత్యపు ఆరోపణలతో, అవాస్తవ కథనాలతో పాఠకులను తప్పుదోవ పట్టించడం నీకు అక్షరాస్యత అనిపిస్తే అది చేతకాని నేను ”నిరక్షర కుక్షి”నే!

బ్లాక్‌ మెయిలింగ్‌లతో, తప్పుడు వార్తలతో స్వార్ధపూరిత డిమాండ్లతో విషపు రాతలు రాయడం అక్షరాస్యుడి పాత్రికేయం అయితే అలా ఎప్పటికీ చేయలేని నేను నిరక్షర కుక్షినే. పత్రికలో వ్రాసిన వార్తకు డబ్బులు తీసుకుని ఖండన ప్రకటనగా వేసే వాడు నీ దృష్టిలో అక్షరాస్యుడైతే అలాంటి నీచపు పనులు చేయలేని నేను ‘నిరక్షర కుక్షినే’!

చందాలు దండుకుని బ్రతుకుతున్నాడని మరీ మరీ వ్రాస్తున్నావు. నీలాగా చందాలు దండుకోవడం లేదు, దందాలూ చేయడం లేదు. నేను అడక్కుండానే ఆదరించి చేరదీసి అభిమానించి అక్కున చేర్చుకునే ఆత్మీయులనే ఆస్తిగా సంపాదించుకున్నాను.

మోసం, దగా, కుట్ర వంటి చేష్టలు చేసి, నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం నాకు లేదు. స్నేహం పేరుతో వ్యక్తులను వాడుకుని అవసరం తీరాక వారితో గొడవపడి పేజీలు పేజీలు వారికి వ్యతిరేకంగా వార్తలు రాసే అలవాటు నాకు లేదు.

అయ్యా… అసలు నీ గురించి మా పత్రికలో నాలుగు లైన్లు వ్రాసినా అది వృధా అనిపిస్తుంది. నీలాంటి ‘అక్కుపక్షి’ గురించి ప్రచురించే స్థలాన్ని ఒక మంచి వ్యక్తి కోసమో, సమాజ శ్రేయస్సు కోసమో ఉపయోగిస్తే సార్ధకత చేకూరుతుంది.

పత్రికా సంపాదకుడినని చెప్పుకుంటూ సంపాదనే ధ్యేయంగా దశాబ్దాల తరబడి హైదరాబాద్‌లో బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారాలను వెలగబెట్టి, అక్కడనుండి పెట్టే బేడా సర్ధుకుని తగుదునమ్మా అంటూ ఇప్పుడు నెల్లూరుకు వచ్చింది నువ్వు.

పత్రికని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్న మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదుగాక… లేదు! ఎవరు ఎంత మాత్రమో, ఎవరి నైతికత, ఎవరి సమర్ధత ఏపాటిదో విజ్ఞత కలిగిన నెల్లూరీయులకు బాగా తెలుసు.

పవిత్రమైన విద్యా సంస్థ మనుగడ కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఆ సంస్థ పురోగతి కోసం తొలి నుంచీ ఆరాట పడు తున్నాం. నీతి, నిజాయితీలతో అక్షర కూలీలుగా నిరంతర సమరం సాగిస్తున్నాం తప్ప సంస్కారవంతులపై నీలా ‘కూలిగాళ్ళు’, ‘వాడూ వీడూ’ అంటూ సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేయడం మాకు చేతకాదు. వ్యక్తిగత దూషణలు అసందర్భ ప్రేలాపనలు మా నైజం కాదు.

ఇక నీకిష్టమొచ్చింది వ్రాసుకో, నీకు చేతనైనన్ని అబద్ధాలను ప్రచురించుకో, నీ ‘కుతి’ తీరేవరకూ నిందలు వేసుకో. ఇలా చేసే ముందు ఒక్క విషయం మర్చిపోకు… రోజూ ఉదయాన్నే ఇంటి బయటకు వచ్చి కుడివైపుకి తిరిగి నీకెదురుగా కనిపించే సూర్యుడిపై ఓసారి ఉమ్మి చూడు… ఫలితం నీకే తెలుస్తుంది.

నీ చెప్పుడు మాటలు నమ్మి, నీ ట్టుకథలకు మోసపోయి విద్యాలయంపై ఉద్యమాలంటూ నీ చేతులలో కీలుబొమ్మగా మారిన కుర్రా వసుంధర తన ఫేస్‌బుక్‌ హోమ్‌పేజీలో పెట్టిన కొటేషన్‌లో ఇలా వ్రాసుకుంది….

”బలహీనుడు వ్యక్తుల గురించి మాట్లాడుతాడు, వ్యక్తుల కోసం పని చేస్తాడు.

బలవంతుడు వ్యవస్థల గురించి మాట్లాడుతాడు, వ్యవస్థల కోసం పని చేస్తాడు.”

కనీసం ఆమె చెప్పిన మాటనైనా విని తెలివి తెచ్చుకో.

మేము ఆ రెండవ కోవకి చెందినవాళ్ళమని గుర్తు పెట్టుకో!…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here