Home జాతీయ వార్తలు బాబు భయానికి ఇదే నిదర్శనం – జైట్లీ

బాబు భయానికి ఇదే నిదర్శనం – జైట్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఓ పక్క ప్రతిపక్ష పార్టీ వైసిపి ఆరోపిస్తూనే వుంది. కాని, తాను నిప్పునని మా ప్రభుత్వంలో ఏ అవినీతి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు వైకాపా వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాడు. అయితే ఈయన మాటల్లో ఎటువంటి నిజం లేదని, దీనికి రాష్ట్రంలో సిబిఐ సోదాల నిరాకరణ నిర్ణయమే ఉదాహరణని రాజకీయ మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడం లేదని ఆయన పేర్కొంటూ పరోక్షంగా ఏపీ సర్కారు అవినీతిని ప్రస్తావించారు. సిబిఐ సోదాలు నిర్వహిస్తే తమ అవనీతి భయటపడుతుందన్న భయంతోనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

కాగా, ఇకపై ఏపీలో సీబీఐ పాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఏసీబీని పోషిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని దర్యాప్తు సంస్థే…రాష్ట్రంపై వచ్చిన అవినీతిని దర్యాప్తు చేస్తుంది! ఇదే ఈ నిర్ణయం వెనుక అసలు మతలబని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి కేసుల విషయంలో బాబు భయపడుతున్నారని వాటినుంచి తప్పించుకునేందుకు.. తమ నేతలపై సోదాలు జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నాయకులు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here