Home రాష్ట్రీయ వార్తలు బాబు బ్రాండ్‌?

బాబు బ్రాండ్‌?

సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ… నిన్నటివరకు ఆయన కని పించని నాలుగో సింహం. అవినీతిపరుల పాలిట సింహస్వప్నం. అన్యాయాలను సహించడు… తప్పు చేసినోడు తనోడైనా పరాయివాడైనా తుప్పు వదిలిస్తాడు… ఇదీ రాష్ట్ర ప్రజల్లో ఆయన పట్ల వున్న అభిప్రాయం.

బహుశా ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై పలు ఆస్తులకు సంబంధించిన కేసులు నమోదు చేయడం, సంబంధం లేని చట్టాలు ఛార్జిషీట్లలో పెట్టి జగన్‌ను జైలుకు పంపించడం వంటివి కూడా ఓ వర్గం ప్రజల్లో ఆయనపై అభిమానాన్ని పెంచాయి. వైసిపి అభిమానులు, కార్యకర్తలు మాత్రం తొలినుండి నెత్తి నోరు కొట్టు కుంటున్నారు… ఆయన అవినీతిపరుల పాలిట సింహస్వప్నం కాదని, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేసే కట్టుబానిస అని. జగన్‌ మీద కేసుల విచారణకేమో బయట రాష్ట్రాల నుండి సిబ్బందిని పిలిపించుకున్న ఆయన, చంద్రబాబుపై కేసు విచారణ వద్దకొచ్చేసరికి తన వద్ద తగినంతమంది సిబ్బంది లేరని చేతులెత్తేసాడు. అప్పుడే చాలామంది గమనించారు ఇతను బాబుకు కట్టప్పలాంటోడని. జె.డి లక్ష్మీనారాయణ చంద్రబాబు పట్ల స్వామిభక్తితో జగన్‌పై పెట్టిన కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. ఈయన నిర్వాకం తెలిసే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను లూప్‌లైన్‌లో పెట్టడం, ఈయనే ఉద్యోగం నుండి స్వచ్ఛంధంగా వైదొలగడం జరిగాయి.

గత కొన్ని నెలలుగా ఆయన రాష్ట్రంలో రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ప్రజలకు నీతిసూత్రాలు, ధర్మ బోధనలు చేస్తున్నారు. ఈయన ప్రచారం తీరు చూసి ఏ బీజేపీలోనో లేదంటే జనసేనలోనో చేరుతాడనుకున్నారు. ఆ విధంగా చేరున్నా ఆయన క్రెడిబులిటీ కొంత అలాగే వుండేది. పోయిపోయి తెలుగుదేశంలో చేరాలనుకున్నాడు. ఆయన పార్టీలో చేరితే అనకాపల్లి ఎంపి టిక్కెట్‌ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. అయితే జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నాడనగానే జేడీ ముసుగు తొలిగినట్లయ్యింది. ఆయన పక్కా చంద్రబాబు మనిషేనని, సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా తన శాఖ కోసం కంటే చంద్రబాబు కోసమే ఎక్కువుగా తపనపడ్డాడనేది అర్ధమైపోయింది. ఒక్క రోజులోనే సోషల్‌ మీడియాలో లక్ష్మీనారాయణ పరువు తీసేసారు. ఆయన మీద నమ్మకం సడలిపోవ డంతో నెటిజన్లు మండిపడ్డారు. లక్ష్మీనారాయణ తమ పార్టీలో చేరితే ఎక్కడ తమ గూడుపుఠాణీ బయటపడుతుందోనని తెలుగుదేశం వాళ్ళే పార్టీలో చేరకుండా చివరి నిమిషంలో ఆయనకు బ్రేకేశారు. అయితే లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరినా చేరకున్నా అతను బాబు బ్రాండేనని జేమ్స్‌బాండ్‌ కాదని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here