Home రాష్ట్రీయ వార్తలు బాబు బాబ్లీ డ్రామా!

బాబు బాబ్లీ డ్రామా!

స్వర్గీయ అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక ప్రొఫెసర్‌ వృత్తిని చేపట్టారు. ఇలా రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులుగా చేసిన చాలామంది పదవీ విరామణ తర్వాత తమకు

ఇష్టమైన వృత్తిని అనుసరించారు. మరి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రాజకీయాల నుండి వైదొలిగితే ఆయన ఎటువంటి వృత్తిని చేపట్టవచ్చు? ఈ ప్రశ్నకు చాలా సులభమైన సమాధానం… దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పొలిటికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయవచ్చు. నేటి రాజకీయాలకు తగినట్లుగా నాయకులను తయారు చేయొచ్చు. ఓట్లను ఎలా రాబట్టలో నేర్పించవచ్చు. ఆయనకు ఇదైతే కరెక్ట్‌గా సెట్‌ అవుతుంది.

మంచో చెడో నేటి రాజకీయాలలో చంద్రబాబు ట్రాకే సపరేటు. ఆయన దేనికీ సిగ్గుపడడు. రాజకీయ విలువల గురించి అసలు పట్టించుకోడు. రాజకీయాలలో అలాంటివి వుంటాయని కూడా అనుకోడు. మాట తప్పడం, మడమ తిప్పడం మా వంశంలోనే లేవు అనే మాటలు ఆయన ఒంటికి పడవు. గంటలోనే మాటను మార్చేయగల ఘనాపాటి. ఎలాంటి అంశాన్నయినా తనకు అనుకూలంగా ఓట్ల రూపంలోకి మలచుకోగల మేధావి. ఆయన అపర రాజకీయ విద్యలు చూసి కాకలు తీరిన రాజకీయ యోధులే ఆశ్చర్య పోతున్నారు. ఐదొందల రూపాయల ఫైన్‌తో పోయే ఓ తొట్టి కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడిస్తున్న నాటకం చూసి జాతీయ రాజకీయ నాయకులే నోరెళ్ళబెడుతున్నారు.

ఈమధ్య బాబ్లీ కేసులో చంద్రబాబుకు అరెస్ట్‌ వారెంట్‌ అంటూ ఎల్లో మీడియా కోడై కూస్తుండడం చూస్తున్నాం. చంద్రబాబును అరెస్ట్‌ చేయడానికి కేంద్రం కుట్ర పన్ను తుందంటూ ఇదంతా ఆపరేషన్‌ పెరుగువడలో భాగమంటూ సినిమాలు లేక ఖాళీగా తిరుగుతున్న శివాజీ మీడియాకు చెప్పడం చూసాం. అంటే అప్పటికే చంద్రబాబుకు అరెస్ట్‌ వారంట్‌ వచ్చింది. దీనిని రాజకీయ కోణంలో మలచుకుని తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు శివాజీని ముందు రంగంలోకి దించడం, ఆ తర్వాత ఈయన సీన్‌లోకి వచ్చి ఇలాంటి అరెస్ట్‌ వారెంట్‌లు నన్నేమీ చేయలేవంటూ స్వాతంత్య్ర సమరయోధుడు లెవల్లో ఫోజిచ్చాడు. చంద్రబాబుపై కేంద్రం కుట్ర పన్నుతుందంటూ రాష్ట్రంలో తెలుగు మంత్రులు, నాయకులు నిరసనలతో హడావిడి చేశారు.

ఈ అరెస్ట్‌ వారెంట్‌కు కేంద్రానికి ఏమన్నా సంబంధముందా? మళ్ళీ ఇం దులో జగన్‌ పాత్ర వుందంటూ అడ్డగోలు ఆరోపణలు. కోర్టులను మేనేజ్‌ చేసే తెలివి తేటలు చంద్రబాబుకు వున్నంతగా జగన్‌కు లేవు కదా! జగన్‌కు అంత మేనేజ్‌ చేసే శక్తే వుంటే ఆయన కోర్టులచుట్టూ ఎందుకు తిరుగుతుంటాడు. చంద్రబాబు కేసులపై స్టేలెందుకు వస్తాయి. అయినా 18కేసులపై స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు బాబ్లీ కేసులో స్టే తెచ్చుకోవడం ఒక లెక్కా!

గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగిన కేసు ఇది. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్ట్‌ను పరిశీలించడానికి చంద్రబాబు అనుచరగణంతో వెళ్లారు. మహారాష్ట్ర పోలీసులు బాబు బృందాన్ని మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్‌ చేసి, అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించారంటూ కేసులు పెట్టారు. ఇవి సాధారణ కేసులే! అయితే అప్పటినుండి ధర్మాబాద్‌ కోర్టు చంద్ర బాబుకు వాయిదాలకు రానందుకు నోటీసులు పంపిస్తూనే వుంది. చంద్రబాబు తన లాయర్‌ను పంపి ఈ కేసును ఎత్తే యించుకుని వుండొచ్చు. కాని, అలా చేయ లేదు. 35 సార్లు నోటీసులిచ్చాక కోర్టు తన నియమనిబంధనల ప్రకారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఎలాంటి కేసులో అయినా సిస్టం ఇదే!

కాని తెలంగాణకు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సరిగ్గా ఈ సమయానికే చంద్ర బాబుకు అరెస్ట్‌ వారెంట్‌ వచ్చింది. ఇంకే పార్టీ నాయకుడన్నా అయితే గుట్టుచప్పుడు కాకుండా ధర్మాబాద్‌ కోర్టుకు హాజరై ఫైన్‌ కట్టి వచ్చేసుండేవాళ్ళు. కాని చంద్రబాబు ఈ పిల్లి బిత్తర కేసును కూడా ఓట్ల యం త్రంగా మలచుకోవాలనుకున్నాడు. కేంద్రం తనపై కక్షగట్టి ఈ అరెస్ట్‌ వారెంట్‌ పంపించి నట్లు డప్పు కొట్టించుకున్నాడు. దీనిద్వారా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తెలంగాణ ఎన్ని కల్లో లబ్దిపొందాలని పన్నాగం పన్నాడు. నిజంగా కేంద్రానికి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే వుంటే ఈ చిల్లర కేసుల గురించి ఆలోచించబల్లేదు. ఓటు – నోటు కేసును సక్రమంగా నడిపిస్తే చాలు. పోలవరం, అమరావతి రాజధాని, పిడి అకౌంట్లు… వంటి అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే చాలు.

బాబు బాబ్లీ కేసు డ్రామాను బాగానే తెరకెక్కించాడు. తతిమా టిడిపి నాయకులు కూడా ఈ నాటకంలో తమ పాత్రలు బాగానే పోషించారు. మరి ప్రేక్షకులనబడే ప్రజలు ఓట్లు అనే చప్పట్ల రూపంలో ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here