Home గల్పిక బాబు ఆశీస్సులుంటేనే ప్రధాని పీఠం

బాబు ఆశీస్సులుంటేనే ప్రధాని పీఠం

”బీజేపీని ఓడించాలి… బీజేపీ ముక్త్‌ భారత్‌… ఇటలీనే ఇండియా… ఇండియానే ఇటలీ… బీజేపీ డౌన్‌ డౌన్‌…” ఢిల్లీ, టెన్‌జనపథ్‌లోని తన గదిలో పడుకున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గాఢనిద్రలో కలవరి స్తోంది. తెల్లారి ఆరుగంటలు కావ డంతో ఎంపీ వి.హెచ్‌.హనుమంతు రావు బెడ్‌కాఫీని ట్రేలో పెట్టుకుని అమ్మగారికివ్వడానికి వచ్చాడు. సోనియాగాంధీ నోటిలో నుండి వస్తున్న ఆ కలవరింతలను శ్రద్ధగా విన్నాడు. వెంటనే బయటకొచ్చి చూసాడు. అప్పుడే రాహుల్‌గాంధీ సైక్లింగ్‌ ముగించుకుని వచ్చాడు. కాకపోతే ఆయన సైకిల్‌ తొక్కు కుంటూ రాలేదు.. దానిని నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అది చూసి విహెచ్‌కు ఆశ్చర్యమేసింది. రాహుల్‌తో… అదేంటి బాబూ.. సైకిల్‌ తొక్కుకుని రాకుండా నెత్తిన పెట్టుకుని వచ్చావని అడిగాడు. అందుకు రాహుల్‌… నేనేమన్నా అమాయకుడినా… మొన్న డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను… బాడీకి వాకింగ్‌ మంచిదా, సైక్లింగ్‌ మంచిదా? అని అడిగాను. ఆయన రెండూ ఒకటే అని చెప్పాడు. అప్పటి నుండి సైకిల్‌ను నెత్తినపెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నాను. అటు సైక్లింగ్‌ చేసినట్లు… ఇటు వాకింగ్‌ చేసినట్లు… అని చెప్పాడు. ఆ సమాధానానికి విహెచ్‌కు దిమ్మ తిరిగింది. తర్వాత తేరుకుని… బాబూ ఒక్కసారి అమ్మగారి గదిలోకి రండి… ఆమె ఒక విషయాన్ని పదే పదే కలవరిస్తోంది. అదేంటో విం దురు రండి అని చెప్పి లోపలకు తీసు కెళ్ళాడు. సోనియాగాంధీ నిద్రలోనే… ”బీజేపీని ఓడించాలి… బీజేపీ ముక్త్‌ భారత్‌” అంటూ కలవరిస్తూనే వుంది. చూడు బాబూ అమ్మగారి కోరిక. ఆమె ఆశయాన్ని మీరే ఎలా గైనా నెరవేర్చాలని రాహుల్‌తో వి.హెచ్‌ అన్నాడు. అప్పుడు రాహుల్‌… ‘అమ్మా’ అంటూ అరిచాడు. ఆ గావు కేకకు సోనియా ఉలిక్కిపడి లేచింది. ఏంట్రా సన్యాసి ఎందుకంత కేక పెట్టావ్‌, నా గుండె గట్టిది కాబట్టి సరిపోయింది అని, ఇంతకీ ఎందు కంతలా అరిచావ్‌ అని అడిగింది. అమ్మా, నీ ఆశల పుత్రుడినమ్మా నేను… నీ ఆశయాన్ని నెరవేరుస్తాను, ఈ కొడుకును దీవించండి అని ఆమె పాదాలకు నమస్కరించి… ఇక పని పూర్తయ్యాకే తిరిగొస్తా అంటూ వెళ్ళి పోయాడు. సోనియాకు ఏమీ అర్ధం కాక… హనుమాన్‌జీ వాడెందుకలా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఏమైంది వాడికి అని అడిగింది. దానికి వి.హెచ్‌… మీరు నిద్రలో ”బీజేపీని ఓడించాలి” అని కలవరించడం రాహుల్‌ బాబు విన్నాడు తల్లీ, మీ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఆయన కంకణం కట్టుకుని వెళ్లాడు అని చెప్పాడు. అప్పుడు సోనియా… అయ్యో ప్రభువా… నా కలవరింతతో వీడిలో ఇంత మార్పు వస్తుందను కుంటే… అదేదో… రాహుల్‌ పెళ్ళి చేసుకోవాలి, నేను మనవడితో ఆడు కోవాలి అని యాక్టింగ్‌ చేసైనా కలవ రించే దాన్ని కదా అని వాపోయింది. వి.హెచ్‌… అంతా ఆ దేవుడే చూసు కుంటాడులే తల్లీ అని నిట్టూర్చి కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పోయాడు.

మూడు నెలల తర్వాత…

టెన్‌జనపథ్‌లో కాంగ్రెస్‌ నేతలు చిదంబరం గులాంనబీ ఆజాద్‌, మనీష్‌తివారి, అంబికాసోని, పనబాక లక్ష్మి, మల్లిఖార్జునఖర్గేలు కూర్చుని వున్నారు. సోనియా అప్పుడే అక్కడకు వచ్చింది. వి.హెచ్‌.హనుమంతురావు అందరికీ బిస్కెట్లు, కాఫీలు అంది స్తున్నాడు. చిదంబరం వుండి… ఏం మేడమ్‌ అర్జంట్‌గా పిలిపించారని అడిగాడు. రెండు నెలల నుండి రాహుల్‌ కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడిస్తానంటూ పోయాడు. ఇదేమన్నా కత్తియుద్ధమా ఒకేసారి ఓడించడానికి… ఆ నరేంద్ర మోడీ, అమిత్‌షాలు అసలే ముదుర్లు… ప్రత్యర్థులను పగబట్టి బొక్కలో వేయి స్తున్నారు. రాహుల్‌కు అసలే లోక జ్ఞానం తక్కువ. అసలే అమాయక రకం. ఈ తింగరోడు ఎక్కడ తిరుగు తున్నాడో… ఎక్కడి కెళ్ళాడో ఏమో… దిగులుగా వుంది అని సోనియా చెప్పింది. అప్పుడు గులాం నబీ ఆజాద్‌ వుండి… రాహుల్‌ ఓ మహాకార్యం తలపెట్టాడమ్మా… దేశంలో వున్న పార్టీలన్నింటిని బీజే పీకి వ్యతిరేకంగా కలుపుతున్నాడు. కత్తిలాంటి కొడుకును కన్నావమ్మా అని చెప్పాడు. అంతలో రాహుల్‌ గాంధీ సడెన్‌గా అక్కడకొచ్చేసాడు. అతనిని చూడగానే సోనియాగాంధీ ఆనందంతో కౌగిలించుకుని… ఇప్పుడే నీ గొప్పతనం గురించి చెబు తుంటే వింటున్నాను నాయనా… వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడా నికి అన్ని పక్షాలను ఏకం చేసావట కదా… ఇంతకీ ఏమేం చేసావ్‌ నాయనా అని సోనియా అడిగింది. అప్పుడు రాహుల్‌ చెప్పసాగాడు. అమ్మా… కర్నాటకలో జెడిఎస్‌తో పొత్తు పెట్టుకుంటాం, వారిచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేస్తాం, ఆంధ్రాలో తెలంగాణలో తెలుగు దేశంతోనూ, మహారాష్ట్రలో ఎన్‌సిపి, శివసేనలతోనూ, బీహార్‌లో ఆర్‌జెడి, తమిళనాడులో డిఎంకె, పశ్చిమబెం గాల్‌లో టిఎంసి, వామపక్షాలతో, ఢిల్లీ, పంజాబ్‌, హర్యానాలలో ఆప్‌, ఇతర పార్టీలతోనూ, యూపిలో ఎస్పీ, బిఎస్పీలతోనూ మిగిలిన రాష్ట్రా లలో కూడా భావసారూప్య, బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తుపెట్టుకోబో తున్నాం. అందర్నీ ఆ దిశగా ఒప్పిం చానమ్మా అని చెప్పాడు. మంచిది నాయనా… ఇంతకీ ఏ రాష్ట్రంలో ఎవరెవరికి ఎన్నెన్ని లోక్‌సభ సీట్లు ఇస్తామని చెప్పావు నాయనా అని సోనియా అడిగింది. అడుక్కునే అల వాటు నాకు లేదమ్మా… ఎన్నోకొన్ని సీట్లు వాళ్లే ఇస్తామన్నారు. అయినా ఎన్ని సీట్లు అన్నది ఇంపార్టెంట్‌ కాదమ్మా… బీజేపీని ఓడించాలన్నదే మీ కోరిక… ఆ కోరిక నెరవేర్చడానికే నేను అన్ని పార్టీలను ఏకం చేసాను అని చెప్పాడు. దానికి సోనియా… బీజేపీని ఓడించడమంటే నిన్ను ప్రధా నిగా చూడాలన్నది నా ఉద్దేశ్యం… రేపు అన్ని పార్టీలతో పొత్తులతో అరకొర సీట్లు తీసుకుని పోటీ చేస్తే ప్రధానివి ఎలా కాగలవు… కనీసం కాంగ్రెస్‌కు 170సీట్లన్నా వస్తేనే కదా పీఎం కావడానికి అవకాశం వుండేది అని అడిగింది. అందుకు రాహుల్‌ నవ్వుతూ… నేనేం పిచ్చోడినా అమ్మా… ప్రధాని కావాలంటే 170సీట్లు బల్లేదు… 7సీట్లున్నా చాలు… గతంలో ఇలా ఆరేడు సీట్లు వచ్చిన వాళ్ళను ప్రధానమంత్రిని చేసిన చంద్రబాబును నేను లైన్‌లో పెట్టాను. మనకు పది, పదిహేను సీట్లొస్తే చాలు… ఆయన అండదండలతో ప్రధానినైపోతాను అని చెప్పాడు. రాహుల్‌ చెప్పింది విని సోనియా

కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here