Home జిల్లా వార్తలు బలపరీక్షకు సిద్ధమైన అజీజ్‌

బలపరీక్షకు సిద్ధమైన అజీజ్‌

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం టీడీపీ టిక్కెట్‌ను ఆశి స్తున్న వారిలో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మొదటి వరుసలో వున్నాడు. టిక్కెట్‌ పోరులో గట్టిగా నిలబడాలంటే చంద్ర బాబుకు తన బలం చూపించాలి. అలా ఆయన బలనిరూపణకు ఓ అవకాశం వచ్చింది. ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా – టీడీపీ హమారా’ పేరుతో మైనార్టీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు భారీగా తన అనుచరులను తరలించి చంద్రబాబు సమక్షంలో తన సత్తా చాటాలని అజీజ్‌ భావిస్తున్నాడు. ఇందుకోసమే నెల్లూరు నుండి దాదాపు 50బస్సులు, ఇతర వాహనాలలో ముస్లిం లను గుంటూరుకు తీసుకెళ్లడానికి సన్నా హాలు చేసాడని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here