Home జాతీయ వార్తలు ఫోర్బ్స్‌.. భారతదేశపు 100 మంది అత్యంత ధనికుల్లో.. ముగ్గురు తెలుగోళ్ళు… వారిలో ఇద్దరు నెల్లూరీయులు

ఫోర్బ్స్‌.. భారతదేశపు 100 మంది అత్యంత ధనికుల్లో.. ముగ్గురు తెలుగోళ్ళు… వారిలో ఇద్దరు నెల్లూరీయులు

ఇది ఖచ్చితంగా ప్రతి నెల్లూరీయుడూ గర్వించదగ్గ విషయం. భారతదేశం మొత్తంలో వున్న ధనికుల్లో అత్యధిక ధన వంతులైన వందమందిలో ముగ్గురు తెలుగువారుంటే, వారిలో ఇద్దరు నెల్లూరీ యులు. ఇండియా ఫోర్బ్స్‌ పత్రిక జరిపిన సర్వేలో ముందు వరుసలో వున్న వంద మంది పేర్లను డిసెంబర్‌ 2018 సంచికలో ఆ పత్రిక ప్రచురించింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన ముఖేష్‌ అంబానీ మొదటి స్థానంలో వుండగా మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ సారధి పి.పిచ్చిరెడ్డి 47వ స్థానంలోనూ, అర విందో ఫార్మా సంస్థల ఛైర్మెన్‌ పి.వి.రామ్‌ ప్రసాద్‌రెడ్డి 50వ స్థానంలోనూ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ నిర్వాహకుడు అనిల్‌ అంబాని 68వ స్థానంలోనూ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కుటుంబం 93వ స్థానం లోనూ వున్నట్లు ఈ పత్రిక ప్రచురించింది.

50వ స్థానంలో నిలచిన పి.వి.రామ్‌ ప్రసాద్‌రెడ్డి, ఆయనతో పాటు 93వ స్థానంలో నిలిచిన రెడ్డీస్‌ కుటుంబసభ్యుడు, సంస్థ సారధి గునుపాటి వెంకటప్రసాద్‌రెడ్డి ఇద్దరూ నెల్లూరీయులే. దేశవ్యాప్తంగా మొదటి 100మంది ధనికుల్లో ముగ్గురు తెలుగోళ్ళ మధ్యలో ఇద్దరు నెల్లూరుకు చెందిన వారుండడం ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రతీ నెల్లూరీయుడికీ గర్వకారణమైన విషయం. రామ్‌ప్రసాద్‌ మరియు జి.వి. ప్రసాద్‌లకు ”లాయర్‌” శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here