Home జాతీయ వార్తలు ప్రధాని పరుగులో… పెద్ద తలకాయలెన్నో…

ప్రధాని పరుగులో… పెద్ద తలకాయలెన్నో…

ఈ నెల 23వ తేదీ ఎన్నికల ఫలి తాలు వెల్లడవుతాయి. మధ్యాహ్నానికే కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నది తేలిపోతుంది. దాని తర్వాత రాజకీయ సమీకరణలు శర వేగంగా మారొచ్చు. ఇదంతా కూడా కేంద్రంలో బీజేపీకి లేదా ఎన్డీఏకు 272 సీట్లు దాటకుంటేనే!

ఎన్డీఏ 272 సీట్లకు పైన సాధిస్తే ప్రధాని పీఠంపై ఎలాంటి చర్చలుండవు. సందేహాలుండవు. సంప్రదింపులుండవు. ఎన్డీఏ కూటమిని రెండోసారి అధికారం లోకి తెచ్చిన ఘనత ప్రధానిగా నరేంద్ర మోడీ ఖాతాలోనే పడుతుంది. కూటమిని విజయ పంథాలో నడిపినందుకు ప్రధాని పీఠం కూడా ఇంకోసారి ఆయనకే దక్కు తుంది. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. ఒకవేళ ఎన్డీఏకు పూర్తి మెజార్టీకి పది ఇరవై సీట్ల దూరంలో ఆగిపోతే… అప్పుడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి లోనూ మార్పు చోటు చేసుకునే అవకాశ ముంది. అయితే ఇది కూడా ఎన్డీఏకు మద్దతు పలకడానికి వచ్చే ఏ ఇతర ప్రాంతీయ పార్టీ అయినా కోరుకుంటేనే! అసలు ఎన్డీఏకు మెజార్టీ మార్క్‌ సీట్లు రాకపోతే ఆ కూటమిలోనే ప్రధాని అభ్య ర్థిగా మరో బీజేపీ నాయకుడిని తెరమీదకు తెచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము.

ఈమధ్య కొన్ని మాధ్యమాలలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాకపోవచ్చని, 10 నుండి 30 సీట్ల దాకా తగ్గొచ్చనే ప్రచారం జరిగింది. ఇది తెలిసినప్పటి నుండి విపక్షాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని రేసులో వున్న పలువురు నాయకులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ సారధి కేసీఆర్‌ అప్పుడే పలు పార్టీల నాయకులను కలవడం ప్రారంభించాడు. కేరళ సీఎం విజయన్‌ను కలిశాడు. డిఎంకె అధినేత స్టాలిన్‌ను ఆయన కలవాలను కున్నాడు కాని, కాంగ్రెస్‌తో కలిసి సాగు తున్న తాము మరో ఫ్రంట్‌లో చేరేది లేదని స్టాలిన్‌ నిర్ద్వందంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే వైసిపిని ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్‌, గతంలోనే టిఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలిసి వున్నాడు. అన్నీ కుదిరి కేంద్రంలో బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా ప్రధాని రేసులో నిలవాలనే ఆశ కేసీఆర్‌లో ఎక్కు వుగా వుంది. అందుకే ఆయన వైసిపిని కలుపుకుంటే ఉభయ తెలుగురాష్ట్రాల నుండి దాదాపు 30కిపైగా సీట్లతో రేసులో ముందుండొచ్చని భావిస్తున్నారు.

ప్రధానిగా రాహుల్‌ కంటే చంద్రబాబే నయమని ఈమధ్య ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రకటించివున్నాడు. అంటే ఒకరకంగా విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఆయన చంద్రబాబుకు మద్దతు పలికినట్లే! అయితే ఇక్కడ ఆయన సొంత తెలివి తేటలు వాడాడు. ఈసారి ఏపిలో తెలుగు దేశంకు పెద్దగా సీట్లు రావనే ఆలోచన ఆయనలో వుంది. ఒకవేళ వచ్చినా ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబును మమతా, మాయా వతి వంటి వాళ్ళు ఒప్పుకోరు. అలాం టప్పుడు చంద్రబాబు తనకు కాకపోతే ప్రధానిగా తనకు మద్దతుగా వస్తాడనే ఆశ పవార్‌ది. అందుకే చంద్రబాబుతో ఆయన అయితే నీకు… లేకుంటే నాకు అనే బాటలో పోతున్నాడు. తృణమూల్‌ కాం గ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ విపక్షాల నుండి ప్రధాని రేసులో బలంగా వున్నారు. ఈ ఎన్నికలలో బెంగాల్‌ నుండి ఆమె 30కుపైగా సీట్లు సాధిస్తే రేసులో ముందు నిలిచినట్లే! యూపీ పార్టీలైన సమాజ్‌వాదీ ఆ పార్టీ తరపున ములాయం సింగ్‌ యాదవ్‌, బహుజన సమాజ్‌ పార్టీ తరపున మాయావతి ప్రధాని రేసులో వున్నారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు యూపిలో వచ్చే ఫలితాలే కీలకం కావచ్చు. మొత్తం 80 సీట్లున్న యూపిలో 2014లో బీజేపీ 72 సీట్లు గెలుచుకుంది. ఈ సీట్లే బీజేపీకి ఆయువుపట్టు. ఈ ఎన్నికల్లో అన్ని సీట్లు రాకున్నా కనీసం సగం సీట్లైనా గెలవగలిగితేనే కేంద్రంలో బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటగలుగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఎస్పీ-బిఎస్పీ కూటమి ప్రభావం బలంగా పనిచేసి ఈ కూటమికి 60కిపైగా సీట్లొస్తే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ ఈ కూటమి హవానే ఎక్కువుగా వుంటుంది. ప్రధాని అభ్యర్థిగా ఎస్పీ నుండి ములాయంకు, బిఎస్పీ నుండి మాయావతికి ప్రాధాన్యత వుంటుంది.

అయితే ఇంతమంది ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధాని రేసులో వున్నారు గాని… కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేరు మాత్రం ప్రధాని పదవికి బలంగా వినిపించడం లేదు. విపక్షాలలో కాంగ్రెస్‌కే అన్నింటికి మించి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా రాహుల్‌కు ప్రధాని ఛాన్స్‌ వుండక పోవచ్చు. ఆయనకు కూడా ఆ పదవిపై అంతగా ఆశలు లేనట్లున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here