Home రాష్ట్రీయ వార్తలు ప్రత్యేక హోదా రావటం చంద్రబాబుకి ఇష్టంలేదు

ప్రత్యేక హోదా రావటం చంద్రబాబుకి ఇష్టంలేదు

వైస్సార్సీపీ బంద్

ప్రత్యేక హోదా పై రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వైస్సార్సీపీ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. ప్రభుత్వం బంద్ ని విఫలం చెయ్యటానికి అన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు స్వచ్చందంగానే బంద్ లో పాల్గొని తమ నిరసన ని తెలియజేసారు.

బంద్ ని విఫలం చెయ్యటానికి ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడిక్కక్కడే వైస్సార్సీపీ నాయకులను నిర్బంధించింది. ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు.

తెలుగుదేశం ప్రభుత్వం బంద్ ను ఎందుకు అడ్డుకుంది

ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఈ బంద్ ని అడ్డుకోవటానికి ప్రయత్నించి తెలుగుదేశం తమ మనసులో మాట బయట పెట్టుకుంది. మొదటినుంచి ప్రత్యేక హోదా అవసరం లేదు అంతకంటే మెరుగయిన ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రం చుట్టూ తిరిగి , అదే మంచిదని దబాయించి, ఇప్పుడు ప్రజలు ప్రత్యేక హోదాకే మద్దతు తెలుపుతుండేసరికి U టర్న్ తీసుకున్న చంద్రబాబు కి మనసులో మాత్రం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే కావాలని వుంది.

ప్రత్యేక ప్యాకేజీ లో మాత్రమే నిధులు నేరుగా తమ ప్రభుత్వం చేతికి వస్తాయి కాబట్టి , ఆ నిధులను తమ ఆధ్వర్యంలో తన బినామీలద్వారా పనులను చేయించి వీలయినంత బొక్కచ్చు అని పెద్దబాబు – చిన్న బాబుల ఆశ. పనిలో పనిగా తమ వాటా తమకి దక్కుతుందని అను’కుల’ మీడియా ఆశ.

దీనికోసం నాలుగేళ్లు గుంటకాడ నక్కలా ఎదురుచూస్తుంటే , జగన్ వల్ల బిజెపితో తెగదెంపులు నాటకాలు , U టర్న్ లు 8 టర్న్ లు ఇలా ఎన్ని టర్న్ లో …

బయట పడ్డ కాంగ్రెస్ తో లాలూచి

ప్రత్యేక హోదా కోసం జరిగిన బంద్ కి మద్దతు ఇవ్వకుండా , అడ్డుకోవటం ద్వారా తెలుగుదేశం తమకి ప్రత్యేక హోదా అవసరం లేదని మరోసారి పరోక్షముగా చెప్పింది , అయితే ప్రత్యేక హోదా తమవల్ల సాధ్యమవుతుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆశ్చ్యర్యకరంగా ( ఇందులో ఆశ్చ్యర్యం ఏముందిలే ) హోదా కోసం పోరాడుతున్న వైస్సార్సీపీ కి మద్దతు ఇవ్వకుండా ఉండటం ద్వారా పరోక్షంగా తెలుగుదేశం వైఖరికే మద్దతు ఇచ్చాయి. దీనిద్వారా తెలుగుదేశం కాంగ్రెస్ ల మధ్య ఉన్న లాలూచి మరోసారి బయట పడింది. అంతే కాక కాంగ్రెస్ వి కూడా పైపై మాటలే కానీ చిత్త శుద్ధి లేదని అర్ధమయ్యింది. అయినా ఈ విషయం చట్టంలో పెట్టకుండా వున్నప్పుడే వాళ్ళ చిత్త శుద్ధి అర్ధమయ్యింది అనుకోండి….

మీరు ఏకీభవిస్తే షేర్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here