Home రాష్ట్రీయ వార్తలు పొత్తుతో కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది

పొత్తుతో కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది

ఆరోగ్యంగా వున్న మనిషి ఒక్కసారిగా కిడ్నీలు, లివర్‌, కళ్ళు, గుండె చెడిపోయి వెంటిలేటర్‌ మీద వుంటే ఎలా వుంటుందో… ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అదే విధంగా తయారైంది. 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రాలో కాంగ్రెస్‌ వికసించిన గులాబీలా వుండేది. ఎన్నికల తర్వాత వాడిన గులాబీ అయ్యింది. వాళ్ళు నెత్తికెత్తుకున్న విభజన అంశమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నిలువ నీడ లేకుండా చేసింది.

2014 ఎన్నికల నాటికే కాంగ్రెస్‌ను వదిలేసి పెద్ద నాయకులందరూ అటు తెలుగుదేశంలోకో, ఇటు వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకో వెళ్ళిపోయారు. అక్కడక్కడా మిగిలిన వాళ్ళు గత నాలుగున్నరేళ్ళుగా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

కాగా, నేడు ఆ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకోవడంతో అరకొర మిగిలిన నాయకులు కూడా కాంగ్రెస్‌ను వీడే పరి స్థితులొచ్చాయి. మాజీమంత్రులు వట్టి వసంతకుమార్‌, పి.బాలరాజు, మాజీఎమ్మెల్యే సి.రామ చంద్రయ్యలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇక ఆ పార్టీలో వున్న ఒకే ఒక ప్రజాకర్షణ నాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి కూడా రేపోమాపో కాంగ్రెస్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం రాష్ట్ర కాంగ్రెస్‌ సారధిగా బాధ్యతలు నిర్వర్తించిన రఘు వీరారెడ్డి కూడా తెలుగుదేశంతో పొత్తుపై మండిపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్‌కు గుడైబ్‌ చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఈ దృష్ట్యా చూస్తే కాంగ్రెస్‌కు మిగిలివున్న అరకొర ఊపిరి కూడా 2019 ఎన్నికల తర్వాత ఆగి పోవడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here