Home రాష్ట్రీయ వార్తలు పొత్తుతోనే చిత్తు!

పొత్తుతోనే చిత్తు!

చరిత్రను రాజకీయ నాయకులు తొందరగా మర్చిపోవచ్చు, లేదా అవకాశవాదం కోసం మర్చిపోయినట్లు కూడా నటించవచ్చు. ప్రజలకు అంతగా మరిచిపోవాల్సిన అవసరముండదు. తాము ఏమి రాజకీయం చేసినా చెల్లుతుందని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ప్రజలు ఆ పిచ్చి దిగిపోయేలా బుద్ధిచెబుతారు.

తెలంగాణ ఎన్నికల్లో జరిగింది ఇదే! సిగ్గు లేకుండా కాంగ్రెస్‌, టిడిపిలు పొత్తు పెట్టుకున్నా, మీకు లేకపోయినా మాకు ఆత్మాభిమానం వుందని చాటుకున్నారు తెలంగాణ ప్రజలు. అవకాశవాద పొత్తును చిత్తుగా ఓడించారు. ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తేరు కున్నారు. ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ చేసుకున్నారు. తెలుగుదేశంతో పొత్తే తమ కొంప ముంచిందని తేల్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోటీ చేసున్నా ఇంకో 20సీట్లన్నా వచ్చి వుండేవని, గౌరవ ప్రదంగానన్నా వుండేదని బాధపడుతున్నారు.

టిడిపితో పొత్తు కాంగ్రెస్‌కు తెలంగాణలో కలిసిరాలేదు. అటువంటి పరిస్థితే ఆంధ్రాలో కూడా వుంది. కాకపోతే ఇక్కడ రివర్స్‌. కాంగ్రెస్‌తో పొత్తు ఇక్కడ తెలుగుదేశంకు నష్టం కలిగించే అవకాశాలున్నాయి. ఏపి ప్రజలకు కాంగ్రెస్‌పై కోపం ఇంకా పోలేదు. 2014 రాష్ట్ర విభజన సంఘటనలు పదేపదే కళ్ళ ముందు మెదులుతున్నాయి. సోనియా, రాహుల్‌లతో సహా అప్పుడు కాంగ్రెస్‌ నాయకుల తల బిరుసుతనం ప్రతిఒక్క ఆంధ్రుడి మనసును చరిత్రను రాజకీయ నాయకులు తొందరగా మర్చిపోవచ్చు, లేదా అవకాశవాదం కోసం మర్చిపోయినట్లు కూడా నటించవచ్చు. ప్రజలకు అంతగా మరిచిపోవాల్సిన అవసరముండదు. తాము ఏమి రాజకీయం చేసినా చెల్లుతుందని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ప్రజలు ఆ పిచ్చి దిగిపోయేలా బుద్ధిచెబుతారు.

తెలంగాణ ఎన్నికల్లో జరిగింది ఇదే! సిగ్గు లేకుండా కాంగ్రెస్‌, టిడిపిలు పొత్తు పెట్టుకున్నా, మీకు లేకపోయినా మాకు ఆత్మాభిమానం వుందని చాటుకున్నారు తెలంగాణ ప్రజలు. అవకాశవాద పొత్తును చిత్తుగా ఓడించారు. ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తేరు కున్నారు. ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ చేసుకున్నారు. తెలుగుదేశంతో పొత్తే తమ కొంప ముంచిందని తేల్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోటీ చేసున్నా ఇంకో 20సీట్లన్నా వచ్చి వుండేవని, గౌరవ ప్రదంగానన్నా వుండేదని బాధపడుతున్నారు.

టిడిపితో పొత్తు కాంగ్రెస్‌కు తెలంగాణలో కలిసిరాలేదు. అటువంటి పరిస్థితే ఆంధ్రాలో కూడా వుంది. కాకపోతే ఇక్కడ రివర్స్‌. కాంగ్రెస్‌తో పొత్తు ఇక్కడ తెలుగుదేశంకు నష్టం కలిగించే అవకాశాలున్నాయి. ఏపి ప్రజలకు కాంగ్రెస్‌పై కోపం ఇంకా పోలేదు. 2014 రాష్ట్ర విభజన సంఘటనలు పదేపదే కళ్ళ ముందు మెదులుతున్నాయి. సోనియా, రాహుల్‌లతో సహా అప్పుడు కాంగ్రెస్‌ నాయకుల తల బిరుసుతనం ప్రతిఒక్క ఆంధ్రుడి మనసును

గాయపరిచింది. ఇప్పుడు రాహుల్‌గాంధీ వచ్చి ఏపికి అది చేస్తాం, ఇది చేస్తామని ఎన్ని గాలి కబుర్లు చెప్పినా ఏపి ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ను క్షమించే ప్రశ్నేలేదు. తడిగుడ్డతో గొంతు కోసేసి ఇప్పుడు ఆపరేషన్‌ చేస్తామంటే తప్పు ఒప్పవుతుందా? కాబట్టి ఆంధ్రాలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడమంటే చంద్రబాబు తన నెత్తిన తాను మట్టి చల్లుకోవడమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here