Home జిల్లా వార్తలు పేరుకు పెద్ద అధికారి… పెడబుద్ధుల పాత్రధారి!

పేరుకు పెద్ద అధికారి… పెడబుద్ధుల పాత్రధారి!

ఒక వ్యక్తి ఆర్ధికంగా ఎదగొచ్చు… రాజకీ యంగా పెరగొచ్చు… హోదా పరంగా ఉన్నత స్థానంలో ఉండొచ్చు… అయితే వివిధ స్థాయిల్లో ఆయా వ్యక్తులు ప్రదర్శించే వ్యక్తిత్వం, వారి బుద్ధి కుశలతను బట్టే వారు వుంటున్న స్థానాలకు గౌరవం వస్తుంది. చదువు, సంధ్య లేనివాడు దొంగయితే సమాజం పెద్దగా పట్టించు కోదు. ఉన్నత చదువులు చదివినోడు దొంగయితే, జనాలను మోసం చేసే చీటర్‌ అయితేనే… సమాజం నీకేం పోయే కాలంరా… అంటుంది.

అదిగో అలా సమాజం వేలెత్తి చూపి స్తోంది ఓ జిల్లా ఉన్నతాధికారి వైపు. ఆయన కూడా చదువు, సంధ్యా లేని వాడు కాదు. గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌. కాని డబ్బుల కోసం అడ్డదారులు తొక్కి నలుగురిని నమ్మించి నట్టేటముంచి అందరి చేత ఛీ కొట్టించుకుంటున్నాడు. ఆ అధికారి

ఎవరో కాదు… నెల్లూరు జడ్పీ సిఇఓ సి.హెచ్‌.సుబ్రహ్మణ్యం. ఇటీవలే ప్రభుత్వం మంజూరు చేసిన పంచాయితీ కార్యదర్శుల పోస్టులను నిరుద్యోగులకు ఎరగా వేసి ఒక్కొక్కరి నుండి 3 నుండి 5లక్షల వరకు గుంజాడు. నెల్లూరుజిల్లాలోనే కాకుండా కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాలో కూడా నిరుద్యోగుల నుండి పంచాయితీ కార్య దర్శుల పోస్టులు ఇప్పిస్తానని ఆశ పెట్టి లక్షలకు లక్షలు వసూలు చేసాడు. ఈ పోస్టుల నియామకం నేరుగా పంచాయితీ రాజ్‌ కమిషనర్‌ భర్తీ చేస్తాడని, ఏపిపిఎస్సీ ప్రమేయం వుండదని నమ్మబలికాడు. ఇతనికి సెక్రటేరియట్‌లో పెద్ద పలుకుబడి వుందనుకున్న పలువురు అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా తమ బంధువులు, స్నేహితులకు పంచా యితీ కార్యదర్శుల పోస్టుల కోసం సుబ్ర హ్మణ్యంను ఆశ్రయించారు. లక్షలకు లక్షలు ఆయనకు సమర్పించుకున్నారు. తీరా చూస్తే సుబ్రహ్మణ్యం చేసింది చీటింగ్‌ అని తేలిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. జిల్లా కలెక్టర్‌ మాత్రం సుబ్రహ్మణ్యం చేసిన తప్పుడు పనికి ప్రస్తుతానికి ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. మోసపోయిన బాధితు లకు ఇక న్యాయం జరగాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here