Home జిల్లా వార్తలు పెద్దగా.. తిరగని పెద్దాయన

పెద్దగా.. తిరగని పెద్దాయన

నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తనకు ఇవ్వ లేరనే బాధ ఈసారి మేక పాటి రాజ మోహన్‌రెడ్డిలో స్పష్టంగా కనిపించింది. ఆయన టిక్కెట్‌పై చాలానే ఆశలు పెట్టుకుని వున్నాడు. 2010లో జగన్‌ వైసిపిని పెట్టినప్పుడు ఆయనను మొండిగా అనుసరించిన నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి. రాజకీయాలు, ఎన్నికలన్నాక ఖర్చుతో కూడుకున్న పని. ఈ విషయంలో రాజ మోహన్‌రెడ్డికి కొంచెం గట్టోడనే పేరుంది. అది పక్కనపెడితే జగన్‌వైపు మాత్రం ఆయన ఏకపక్షంగా నిలబడ్డాడు. వైసిపి లోకి వచ్చాక తన ఎంపి పదవికి రాజీ నామా చేయాల్సి వస్తే చేశాడు. ఉపఎన్ని కల్లో నిలబడాల్సివస్తే నిలబడ్డాడు. 2012, 2014 ఎన్నికల్లో వైసిపి నెల్లూరు ఎంపీగా పోటీచేసి గెలిచాడు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా జగన్‌ రాజీనామాకు ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేశాడు. వైసిపి తరఫున ఢిల్లీలో జరిగిన అన్ని ఆందోళనలలో ముందుండి నడిచాడు.

అలాంటి మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో వివిధ కారణాలతో సీటు రాలేదు. ఈ విషయంలో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడనే తెలుస్తోంది. అయితే పార్టీకి వ్యతిరేకంగా పోలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన నాయ కుడు… ఉదయగిరి, ఆత్మకూరు నియో జకవర్గాలలో తన తమ్ముడు, కొడుకుల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాడు.

వైసిపికి ఒక పెద్ద దిక్కు మేకపాటి రాజమోహన్‌రెడ్డి. నమ్మకానికి నిలువెత్తు చిరునామా. వైసిపి కనుక అధికారంలోకి వస్తే ముందు ఇలాంటి విశ్వసనీయతగల నాయకులను గౌరవించుకోవాల్సి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here