Home జిల్లా వార్తలు పిలిస్తే పలుకుతానంటున్న రస్తోగి!

పిలిస్తే పలుకుతానంటున్న రస్తోగి!

జిల్లా నూతన ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి అక్టోబర్‌ 31వతేదీ ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం రూరల్‌ అదనపు ఎస్పీగా పని చేస్తూ బదిలీపై ఆయన నెల్లూరుజిల్లాకు ఎస్పీగా రావడం జరిగింది. ఇక్కడ ఎస్పీగా వున్న పిహెచ్‌డి రామకృష్ణను విజయవాడలోని ఇంటలిజెన్స్‌ విభాగానికి బదిలీ చేయడం జరిగింది. ఐశ్వర్య రస్తోగికి ఎస్పీగా నెల్లూరుజిల్లాలోనే మొదటి పోస్టింగ్‌. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రస్తోగిని ఏఎస్పీ పరమేశ్వరరెడ్డి, అందరు డిఎస్పీలు, సిఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ ప్రజలతో సత్సం బంధాలు ఏర్పరచుకుని ప్రజా పోలీసు వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పారు. జిల్లాలో ప్రధానంగా వున్న సమస్యలపై అవగాహన తెచ్చుకుని, వాటి పరిష్కారా నికి కృషి చేస్తానన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌, ఎర్రచందనం, అక్రమ రవాణా, మైనింగ్‌ మాఫియా వంటి వాటిని ఉపేక్షించే ప్రశ్నేలేదని, సమర్ధవంతంగా నిరోధిస్తా మని, ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ట్రాఫిక్‌ సమస్యలు, ఆస్తుల నేరాలు, చైన్‌ స్నాచింగ్స్‌ ఎక్కువుగా వున్నట్లు తెలు స్తోందని, ప్రజలు ఏ సమయంలో అయినా సమస్యను తమ దృష్టికి తీసుకు రావచ్చని, ప్రతి సోమవారం డైల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాన్ని కూడా నిర్వ హిస్తామని, నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకోలేని వారు, ఫోన్‌ ద్వారా తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖలో సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని, పోలీసు శాఖ ద్వారా జిల్లా ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించేందుకు ప్రయత్నిస్తానని రస్తోగి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here