Home జిల్లా వార్తలు పాశంకు పనబాక సెగ!

పాశంకు పనబాక సెగ!

కొన్నిరోజుల క్రితం పనబాక కృష్ణయ్య, లక్ష్మి దంపతులను తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు వైసిపి నాయకులు. ఇద్దరికీ సీట్లు కూడా ఇస్తామన్నారు. చేరడానికి కృష్ణయ్య సిద్ధమయ్యాడు కాని పనబాక లక్ష్మి మాత్రం వెనుకడుగేసింది. తనకు సోనియా గాంధీ వద్ద వున్న పరపతి దృష్ట్యా, భవిష్యత్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తనకు మంచి భవిష్యత్‌ వుంటుం దనుకుని ఆమె వైసిపిలోకి రాలేదు. ఆమెతో పాటు ఇక కృష్ణయ్య కూడా కాంగ్రెస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

అయితే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రాలోనూ కలిసి పోటీ చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు సిద్ధమయ్యాయి. ఏపిలో పెద్ద పార్టీ తెలుగుదేశం కాబట్టి, మిత్రపక్షంగా కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు ఇవ్వాలి. ఇలా ఇచ్చే సీట్లలో పనబాక కృష్ణయ్యకు ఛాన్స్‌ వుండొచ్చని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్‌కు ఏదైనా సీటు ఇవ్వాలనుకుంటే అది గూడూరే వుండబోతుంది. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు. వైసిపిలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. రేపు ఆయనకు సీటిచ్చినా ఓడిపోతాడనే ప్రచారం జరుగుతోంది. అందుకని కాంగ్రెస్‌ ఖాతాలో దానిని జమ వేయడానికి చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించడు. ఇక కాంగ్రెస్‌కు కూడా అంతో ఇంతో కరెక్ట్‌ సీటు ఇదే! పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వున్న పనబాక కృష్ణయ్యే గూడూరు అభ్యర్థి అవుతాడు. స్థానికంగా పట్టున్న నాయ కుడు. కాబట్టి కాంగ్రెస్‌ కూడా ఈ సీటునే కోరవచ్చు. కాంగ్రెస్‌ సింగిల్‌గా పోటీ చేస్తే 2014లో లాగే డిపాజిట్‌ కూడా రాదేమో గాని, తెలుగుదేశం పొత్తు మీద కాబట్టి గట్టిగా నిలబడొచ్చు. కృష్ణయ్య అభ్యర్థి అయితే వైసిపి అభ్యర్థిని బట్టి పోటీ తీవ్రత వుంటుంది! ఎటొచ్చి కాంగ్రెస్‌, టీడీపీల పొత్తు సునీల్‌ సీటుకు పొగపెట్టేటట్లుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here