Home జిల్లా వార్తలు పార్లమెంటుకు వెళతాడా?

పార్లమెంటుకు వెళతాడా?

తెలుగుదేశం నుండి నెల్లూరు పార్లమెంటుకు వినిపిస్తున్న మొదటి పేరు ఆదాల ప్రభాకర్‌రెడ్డి. ఒకవేళ ఆయన నేను పోటీ చేయనంటేనో, లేదా ఒక పార్లమెంటు సీటును బీసీలకు ఇవ్వాలని చెప్పి ఇస్తేనో వెంటనే వినిపిస్తున్న పేరు బీద మస్తాన్‌రావు. 2012 ఉపఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్‌ నుండి పోటీ చేసాడు. దారుణ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆరోజున్న పరిస్థితులు వేరు, ఇప్పుడంత దారుణం లేదనుకోండి.

కాని పార్లమెంటుకు పోటీ చేయాల్సి వస్తే బిఎంఆర్‌ చేస్తాడా? ముందు కావలిని వదులుకుంటాడా? ఇంతవరకు గెలిచినా ఓడినా ఆయనకంటూ కావలి అసెంబ్లీ నియోజకవర్గం అన్నది ఒకటుంది. వరుసగా మూడుసార్లు ఓడిపోయినా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లిని వదల్లేదంటే కారణం అది తన అడ్డాగా భావించడమే! గెలిచినా ఓడినా అసెంబ్లీ స్థానంలో వున్న ఆ ఫీలింగ్‌ పార్లమెంటులో రాదు. అదీగాక పార్లమెంటు స్థానం అన్నది పర్మినెంట్‌ కాదు. ఒకసారి ఓడిపోయామంటే ఆ తర్వాత దఫా మనకే ఇస్తారనే గ్యారంటీ లేదు. కనీసం అసెంబ్లీలో అయితే ఒకసారి కిందపడొచ్చు, ఇంకోసారి పైన పడొచ్చు. 2004లో బిఎంఆర్‌ అల్లూరు నుండి ఓడిపోయాడు. 2009లో అల్లూరు కలిసిన కావలి నుండి పోటీచేసి గెలిచాడు. 2014లో కావలి నుండి ఓడిపోయాడు. అప్పటి నుండి కూడా ఆయన నియోజకవర్గాన్ని వదల్లేదు. కావలి నియోజకవర్గంలో ఈరోజుకు కూడా బీద మస్తాన్‌రావే బలమైన అభ్యర్థి. ఇక్కడున్న స్థానిక బలం పార్లమెంటులో రాదు. ఈ నేపథ్యంలో అవకాశం వచ్చినా బీఎంఆర్‌ పార్లమెంటుకు పోటీ చేస్తాడా అన్నది సందేహమే!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here