Home జాతీయ వార్తలు పార్లమెంటరీ కమిటీలో విపిఆర్‌

పార్లమెంటరీ కమిటీలో విపిఆర్‌

సేవా వారధి, ఆథ్యాత్మిక సారధి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని మరో పదవి వరించింది. కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటి సభ్యుడిగా ఆయనను నియమించారు. భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఛైర్మెన్‌గా వ్యవహ రిస్తున్నారు. ఓ నెల్లూరీయుడు ఆశీస్సులతో మరో నెల్లూరీ యుడికి దక్కిన అరుదైన అవకాశం ఇది. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి తనకు అప్పగించిన అత్యున్నతమైన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని, ఈ కమిటీ ద్వారా దేశ భద్రత, రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు మరియు రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా నవ్యాంధ్రకు రావలసిన అన్ని ప్రయోజనాలపై జరగబోయే కమిటీ సమావేశా లలో న్యాయం జరిగేవిధంగా కషిచేస్తానని, రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించిన అంశాలపై రాజీలేని పోరాటం చేస్తానని ముఖ్యంగా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here