Home రాష్ట్రీయ వార్తలు పార్టీలో జగన్ కు తెలీకుండా చాలా జరుగుతోంది

పార్టీలో జగన్ కు తెలీకుండా చాలా జరుగుతోంది

వై.యస్.జగన్మోహన్ రెడ్డి… కాబోయే ముఖ్యమంత్రి… ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. అయితే ఇటువంటి మాటలే మళ్ళీ జగన్ ను ముంచనున్నాయా? గత ఎన్నికలలో లాగే ఎలక్షన్ టైమ్ కు సీన్ మారుతుందా… ఇప్పుడు పార్టీలో జరిగే పరిణామాలు చూస్తుంటే జగన్ ను నమ్ముకన్న వాళ్ళకు న్యాయం జరగడం లేదనిపిస్తోంది. దీనికి ఉదాహరణే పలు నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం. నాలుగున్నరేళ్ళుగా పార్టీని నమ్ముకుని పార్టీకి తమ డబ్బు ఖర్చుపెట్టిన కొొంతమంది ఇన్ ఛార్జ్ లను ఎలక్షన్స్ టైమ్ దగ్గరకొచ్చేటప్పటికి మార్చడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం కొందరు వైకాపా నేతలు, జగన్ కు సన్నిహితంగా మెలిగే కొందరు డబ్బులు తీసుకుని జగన్ కు వారిని హైప్ చేసి చూపిస్తూ వారికి ఇన్ ఛార్జ్ పదవులను అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్రలో జనం సమక్షంలో ఉండే జగన్ కు ఈ విషయం తెలియకపోవచ్చు. కాని, ఇకమీదటన్నా జగన్ ఇలాంటి వారిని దూరంగా పెట్టి… జనం మధ్య జనం సమస్యలకోసం పోరాడితే… ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కాగలడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here