Home జిల్లా వార్తలు పార్టీలో చేరకుండానే… ప్రచారంలో దూకుడు

పార్టీలో చేరకుండానే… ప్రచారంలో దూకుడు

ఆత్మకూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య ప్రచారంలో వున్నాడు. 14ఏళ్ల నుండి రాజకీయాలకు దూరంగా వున్న ఆయనను తీసుకొచ్చి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రతిపాదిస్తు న్నారు. బొల్లినేని కృష్ణయ్య, ఆయన తరపున ఎలక్షన్‌ బాధ్యతలు చూసే టి.గిరి నాయుడులు ఆత్మకూరు నియోజకవర్గంలో వాళ్ళు, వీళ్లు అని లేకుండా అందరితో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతునివ్వాలని కోరుతున్నారు. కృష్ణయ్యకు వ్యక్తిగతంగా మంచిపేరుంది. కాబట్టి కొందరు నాయకులు సానుకూలంగానే స్పందిస్తున్నారు.

ఆ పార్టీ మనిషేనా?

అంతా బాగానే వుంది కాని, తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలను కుంటున్న బొల్లినేని కృష్ణయ్య అసలు ఆ పార్టీ మనిషేనా? ఆ పార్టీలో ఆయనకు సభ్యత్వముందా? అసలు తెలుగుదేశంలో ఆయనెప్పుడు చేరాడు? ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఇంతవరకు బొల్లినేని క్రిష్ణయ్య రాజకీయ ప్రయాణానికి, తెలుగుదేశం పార్టీకి ఎటు వంటి సంబంధం లేదు.

1999లో ఆయన కాంగ్రెస్‌పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 1999 ఎన్నికల్లో ఆత్మకూరు నుండే కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచాడు. ఐదేళ్ళు కాంగ్రెస్‌లోనే వున్నాడు. 2004లో బీజేపీలోకి వెళ్లాడు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఆత్మకూరు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2009లో ఆత్మకూరు నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డి గెలుపుకు సహకరించాడు. అప్పటి నుండి బొల్లినేని వర్గం ఆనం రామనారాయణరెడ్డితోనే కలిసి నడి చింది. 2015లో ఆనం వాళ్ళు తెలుగుదేశంలో చేరినప్పుడు బొల్లినేని వర్గీయులు చేరారేగాని, కృష్ణయ్య వచ్చి నేరుగా చేరలేదు. అధికారికంగా ఇంతవరకు కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భమే లేదు. మరి పార్టీలో చేరకుండానే ఆయనను అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here