Home జిల్లా వార్తలు పార్టీయే పరమావధి… పోరాటమే ఆయన విధి

పార్టీయే పరమావధి… పోరాటమే ఆయన విధి

నెల్లూరుజిల్లా రాజకీయాలలో ఎప్పుడు ఏ నాయకుడు ఫామ్‌లో వుంటాడో, ఏ పదవి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఊహిం చడం అసాధ్యం. అటు కాంగ్రెస్‌పార్టీ లోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. పార్టీ జెం డాలు మోసి పార్టీ అజెండాలను ప్రజల ముంగిళ్ళలోకి తీసుకువెళ్ళి అవసరమై నప్పుడు పార్టీ కోసం పోరాడే ద్వితీయశ్రేణి వ్యక్తులు ఒక్కోసారి గుర్తింపుకు నోచుకోరు.

తెల్లవారింది మొదలు రాత్రి వరకు జిల్లాకు చెందిన ఒకే అగ్రనాయకుడిని నమ్ముకుని ఆ నాయకుడి అడుగులకు మడుగులు వత్తుతూ, ఆయన వెంట నీడలా తిరుగుతూ ఆయన సేవలో తరిస్తూ వుంటే అలాంటి వ్యక్తులకు వారు పార్టీలో జూనియర్లైనా రాష్ట్ర స్థాయి పదవి అనూ హ్యంగా వరిస్తుంది. ఇలా రెండు కోవలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు జిల్లాలో అన్ని పార్టీల్లోనూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో మొదటి కోవకు చెందిన నాయకుడే నెల్లూరు 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ నూనె మల్లిఖార్జున యాదవ్‌. గత 35సంవత్సరాలుగా రాజకీయాలలో వుంటూ ఒకే పార్టీ సిద్ధాంతంతో తెలుగు దేశం జెండాని మోస్తూ బిసి నాయకుడిగా మంచి గుర్తింపును సాధించినా, ఆ గుర్తిం పును జిల్లా స్థాయికే పరిమితం చేసుకున్న వ్యక్తి నూనె మల్లి.

1995లో తనకు సంబంధంలేని వార్డులో పార్టీ టిక్కెట్టిచ్చినా పోటీ చేసి ఓటమిపాలై, పట్టువదలని విక్రమార్కుడిలా 2000 సంవత్సరంలో చాట్ల నరసింహా రావుపై 27వ వార్డులో అనూహ్య విజ యాన్ని సాధించి అప్పట్లో పెద్ద సంచల నాన్ని సృష్టించాడు. ఆ తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నగర అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు విధులు నిర్వహించాడు. తెలుగు యువత నగర అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర బి.సి విభాగం ప్రధాన కార్యదర్శి హోదా కూడా మల్లిని వరించింది.

రూరల్‌ నియోజకవర్గం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలోనూ, 7మెన్‌ కమిటీలోనూ మల్లికి చోటు లభించింది. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆయన పని చేశాడు. జిల్లా పార్టీ అధికార ప్రతి నిధిగానూ ఇంకా జిల్లాలో పార్టీకి సంబం ధించిన అనేక విభాగాల్లోనూ మల్లి తన సేవలందించాడు. ఇప్పటికీ అందిస్తూనే వున్నాడు.

గతంలో తాళ్ళపాక అనూరాధ ఛైర్‌ పర్సన్‌గా వున్న తరుణంలోను మున్సిపల్‌ బై ఎలక్షన్‌ తరుణంలోనూ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొని పార్టీ కోసం పోరాడిన వ్యక్తిగా మల్లికి గుర్తింపు వుంది. అనిల్‌ కుమార్‌యాదవ్‌ ఓ వైపు, బుర్రా వెంక టేశ్వర్లుగౌడ్‌ మరోవైపు పోరాడుతుంటే ఆ సమయంలో తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేశాడు మల్లి యాదవ్‌. ప్రస్తుతం 21వ డివిజన్‌ కార్పొ రేటర్‌గా గెలిచి నిత్యం ప్రజలకు అందు బాటులో వుంటూ ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తూ… మరోవైపు పార్టీ వ్యవహారాలలో కూడా ఎక్కడ తన అవ సరమొచ్చినా నేనున్నానంటూ ముందుండి పని చేస్తున్నాడు. కౌన్సిల్‌ కీలక సమా వేశాల్లో ఆనం రంగమయూర్‌తో పలు దఫాలు వాగ్వివాదానికి దిగి ‘ఆనం’ వర్గాన్ని ఎదిరించిన ధీరుడిగా కూడా పేరుపొందాడు.

మూడున్నర దశాబ్దాల పాటు బిసి నాయకుడిగా కష్టించి పని చేస్తున్న తమ నాయకుడికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రభుత్వ పరమైన పదవి ఏదీ రాలేదని, నిన్న మొన్న పార్టీలోకి వచ్చి అగ్రనాయకుల భజన చేసేవారికి గుర్తింపునిస్తోందని మల్లి ఖార్జునయాదవ్‌ అభిమానులు వాపో తున్నారు.

నిద్రలేచిన దగ్గర నుండి ప్రజల కోసం, పార్టీ కోసం తమ నాయకుడు పని చేస్తాడని, ఎప్పుడూ అందరికీ అందుబాటులో వుంటాడని, అలాంటి వాడిని ఇటు జిల్లా పార్టీ నాయకత్వం అటు పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా నేతలు మేల్కొని తమ నాయకుడి కష్టాన్ని గుర్తించి తగిన స్థానం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here