Home గ్రామ సమాచారం పల్లెల్లో ప్రత్యేక పాలన

పల్లెల్లో ప్రత్యేక పాలన

పంచాయితీలలో సర్పంచ్‌ల పాలనా కాలం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుండి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. 2013లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. గత నెలాఖరుతో పంచాయితీల పదవీ కాలం ముగియనుందన్నప్పటికీ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఎన్నికల కమిషన్‌ దీనిపై కసరత్తు చేసినప్పటికీ ప్రభుత్వ సహకారం కొరవడడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం ఏర్పడలేదు. జిల్లాలో 940 పంచాయితీలున్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగియ నుండడంతో ఇక ఈ పంచాయితీలకు తహశీల్దార్‌, ఎంపిడిఓ, డిప్యూటీ తహశీల్దార్‌ స్థాయి అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించనున్నారు. పంచాయితీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని వీళ్ళు గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. గ్రామాలలో పన్నుల వసూళ్ళు, పారిశుద్ధ్యం, మంచినీళ్ళు, విద్యుత్‌, డ్రైనేజీ వంటి పనులన్నీ వీళ్ళ నియంత్రణలోనే వుంటాయి. కాకపోతే సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఆగిపోయే అవకాశాలు లేకపోలేదు. పంచాయితీ ఎన్నికలు ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఉండబోతాయి. అప్పటిదాకా ప్రత్యేకాధికారుల పాలన తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here