Home నెల్లూరులో నేడు పరువు నిలిపిన రైల్వేస్టేషన్‌

పరువు నిలిపిన రైల్వేస్టేషన్‌

ఈమధ్య దేశంలోనే అత్యంత కాలుష్య నగరాలను ప్రకటించగా… అందులో నెల్లూరు నగరం ఉండడం నెల్లూరీయులను బాగా నిరాశకు గురిచేసింది. నెల్లూరు రోడ్లు, రోడ్లపై దుమ్ము, పెరిగిన వాహనాల కాలుష్యం నెల్లూరును కాలుష్యపు నగరాల జాబితాలో చేర్చాయి. అయితే నెల్లూరును చెత్త నగరం లెక్కలో వేసినా… నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ మాత్రం స్వచ్ఛత రైల్వేస్టేషన్‌లలో దేశంలోనే 16వ స్థానంలో నిలవడం నెల్లూరీయులు ఆనందించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌ల స్వచ్ఛతపై సర్వే నిర్వహించారు. ఆ సర్వే నివేదికను తాజాగా విడుదల చేశారు. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు ఏ-కేటగిరిలో దేశంలోనే 16వ స్థానం దక్కింది. అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలో 4వ స్థానం, విజయవాడ డివిజన్‌ పరిధిలో మొదటి స్థానం దక్కడం విశేషం. గత ఏడాది దేశంలోనే 60వ స్థానంలో వున్న నెల్లూరు రైల్వేస్టేషన్‌ ఈసారి 16వ స్థానానికి ఎగబాకడం చూస్తుంటే రైల్వే అధికారులలోనే కాదు ప్రయాణీకులలోనూ స్వచ్ఛభారత్‌పై చాలా అవగాహన వచ్చిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here