Home రాష్ట్రీయ వార్తలు పరిణితి చూపాడు.. ప్రశంసలు పొందాడు

పరిణితి చూపాడు.. ప్రశంసలు పొందాడు

ఎవరు పొడిపించారు? ఎవరు ప్లాన్‌ చేశారు? వెనుక ఎవరి హస్తముంది? ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలున్నాయా?

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఈ సందేహాలన్నీ పక్కన పెడితే, సంఘటన జరిగిన తర్వాత ప్రధాన పార్టీల అధినేతలుగా దీనిపై జగన్‌, చంద్రబాబులు స్పందించిన తీరు వారి మనస్తత్వాలకు, వ్యక్తిగత హూందాతనానికి అద్ధం పట్టింది. ఈ సంఘటన జరిగిన తర్వాత నాలుగు పదులు నిండిన వయసులో ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎంతో హూందాగా వ్యవహరించి రాష్ట్రంలోని మేధావులు, తటస్థుల ప్రశంసలు పొందాడు. అదే సమయంలో ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో వున్న చంద్రబాబు ఈ సంఘటనపై లేకి మాటలు, వెకిలి చేష్టలతో సీఎం పోస్టుకున్న విలువనే దిగజార్చాడు.

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆరోజు జగన్‌ స్థానంలో చంద్రబాబే వుండుంటే చేతికి కట్టు కట్టించుకుని దీనిపై పెద్ద రాద్ధాంతం చేసుండేవాడు. విశాఖ మెయిన్‌రోడ్డులోనే దీక్షలు గట్రా చేసి సానుభూతికి పాకులాడి వుండే వాడు. దీనిద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు నానా ఆగిత్యం చేసుండేవాడు.

జగన్‌ అలా ప్రవర్తించ లేదు. తనపై దాడి జరి గాక ఆవేశంగా కూడా ప్రవర్తించలేదు. నిందితుడిని చట్టబద్ధంగా పోలీసులకు అప్పగించడానికే ప్రాధాన్యత నిచ్చాడు. తాను విశాఖలోనే వుంటే జనం గుమికూడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించి గాయం తోనే నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే హైదరాబాద్‌ వెళ్లి పోయాడు. తనకు ఏమీ కాలేదని, కార్యకర్తలు ఆందోళనపడాల్సిన పనిలేదని సంఘటన జరిగిన వెంటనే స్పందించి సందేశమివ్వడం ద్వారా రాష్ట్రంలో హింసాయుత వాతావరణం ఏర్పడకుండా చేశాడు.

ఈ సంఘటన తర్వాత జగన్‌ చూపిన సమయ స్ఫూర్తి, బుద్ధికుశలత అతనిని మరింత మంది ప్రజల మనసులకు చేరువచేసింది. 2014 ఎన్నికల్లో జగన్‌కు అనుభవం లేదు, రాజకీయ పరిణితి లేదు అని ఆయ నను వ్యతిరేకించిన తటస్థులు, మేధావులు కూడా ఇప్పుడు జగన్‌ను పూర్తి పరిణితి వున్న నాయకుడుగా, 40ఏళ్ళ అనుభవం వున్న చంద్రబాబు కంటే కూడా మంచి నాయకుడిగా భావిస్తున్నారు. జగన్‌ పట్ల అభి మానాన్ని పెంచుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here