Home గ్రామ సమాచారం పరసాతో పని లేదు

పరసాతో పని లేదు

జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడ్‌ నియో జకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఎన్ని కల్లో నిలబడే అభ్యర్థులు, గెలిచే ఎమ్మెల్యేలు దళితులైనప్పటికీ, నడిపించేది మాత్రం అగ్రవర్ణాల నాయకులే! ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా పరోక్ష పెత్తనం మాత్రం వారిదే!

1994 నుండి 2014వరకు పరసారత్నం సూళ్ళూరుపేట నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పర్మినెంట్‌ అభ్యర్థిగా ఉంటున్నాడు. ఈ నియోజకవర్గం నుండి వరుసగా ఐదుసార్లు పోటీ చేసాడు. మూడుదఫాలు గెలిచాడు. 2004, మొన్న జరిగిన 2014 ఎన్నికల్లో ఓడిపో యాడు. 1983 నుండి కూడా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకోవడంలో వేనాటి సోదరులు కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. 1994లో సూళ్ళూరుపేట అభ్యర్థిగా వచ్చిన పరసా రత్నం వేనాటి కుటుంబంతో సఖ్యతగానే వుంటూ వచ్చాడు.

ఒకప్పుడు సూళ్ళూరుపేట తెలుగుదేశం అంటే వేనాటి కుటుంబందే పెద్ద నాయ కత్వం. కాని, ఇప్పుడు పార్టీలో బహునాయకత్వం తయారైంది. ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరిని అభ్యర్థిగా తెరమీదకు తెస్తారో చెప్పలేని పరిస్థితి. అయితే వరుసగా ఐదుసార్లు పోటీ చేసిన పరసారత్నంను మాత్రం ఈసారి వేనాటి వ్యతిరేకిస్తన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజల్లో పరసాపై గతంలో వున్నంత ఆదరణ లేదు. వైసిపి ఎమ్మెల్యే సంజీవయ్యకు ప్రజల్లో మంచి పేరుంది. పరసా రత్నం ఆయనకు గట్టి పోటీనివ్వలేడనే అభిప్రాయం వుంది. దీనివల్లే ఈసారి పోటీకి పరసా పనికిరాడంటున్నారు. ఇక పరసా బదులు సంజీవయ్యకు ధీటైన అభ్యర్థి దొరకడం పార్టీ నాయకత్వానికి పెద్ద సమస్యే కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here