Home రాష్ట్రీయ వార్తలు పనిచేయని పవన్‌ పవర్‌

పనిచేయని పవన్‌ పవర్‌

2014 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా వాడుకున్న చంద్రబాబు, 2019 ఎన్నికల్లో మాత్రం పరోక్షంగా వాడుకోవాలనుకున్నాడు. జగన్‌ను ప్రజల్లో తిట్టడం, జనసేన తరపున వైసిపి బలంగా వున్న నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు తెలుగుదేశంకు వ్యతిరేకమయ్యే కాపుల ఓట్లను వైసిపికి పోకుండా జనసేనకు మళ్ళించడం… ఇదీ పవన్‌ కళ్యాణ్‌పై చంద్రబాబు పెట్టుకున్న ఆశల మార్గం.

అయితే పవన్‌కళ్యాణ్‌ మూలంగా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఆయనను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలు భావించడం లేదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యమే ఎంతో మేలు. కొంత వరకన్నా బలమైన నాయకులు కనిపించారు. దాదాపు వంద సీట్లలో గట్టి అభ్యర్థులే దిగారు. ఇప్పుడు జనసేనను చూస్తే నాలుగు అసెంబ్లీలకు కూడా గట్టి అభ్యర్థులు లేరు. పవన్‌కళ్యాణ్‌ను ప్రజలే కాదు సొంత కాపు సామాజికవర్గం నేతలు కూడా నమ్మడం లేదు. అందుకే చంద్రబాబుకు ధీటైన నాయకుడిగా భావిస్తున్న జగన్‌ వైపు చూస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నాడన్న విషయం కాపు నేతలకు అర్ధమై పోయింది. ఇంకోసారి పవన్‌ కళ్యాణ్‌ను నమ్మడం అంటే చంద్రబాబుకు తమను తాము అమ్ముకోవడమేనని భావించారు. అందుకే జనసేన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పవన్‌ ఏదో పొడుస్తాడనుకున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా పవన్‌కు అంతసీన్‌ లేదని తేలిపోయింది. పవన్‌ తన పరువును కాపాడుకోవాలంటే ఎన్నికలకు దూరంగానన్నా వుండాలి, లేదంటే వైసిపితో పొత్తు పెట్టుకుని తనను నమ్మి వచ్చిన వాళ్ళకు సీట్లన్నా ఇప్పించు కోవాలి. అదీ లేకుంటే.. ఎన్ని కలకు దూరంగానన్నా ఉండాలి. ఆయన ముందున్న మార్గాలు కూడా ఇవే! అంతేగాని, మరో సారి చంద్రబాబుకు సపోర్ట్‌ చేస్తే తన నెత్తిన తానే మట్టి చల్లుకోవడం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here