Home రాష్ట్రీయ వార్తలు పచ్చ మీడియా రచ్చతో… బాబుకు మచ్చ

పచ్చ మీడియా రచ్చతో… బాబుకు మచ్చ

ఇది అందరికీ తెలిసిన కథే… కాని, అన్ని తరాలవాళ్ళు తెలుసుకోవాల్సిన కథ… అనగనగా ఒక కొడుకు… ఒకరోజు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి తోటకూర దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చాడు. దొంగతనం తప్పని చెప్పాల్సిన తల్లి, కొడుకు తెచ్చిన తోటకూర చూసి మురిసిపోయింది. కొడుకును భలే పని చేసావంటూ పొగిడింది. దాంతో ఆ కొడుకు ఈసారి వంకాయలు దొంగలించి తెచ్చాడు. తల్లి మళ్ళీ అభినందించింది. కొడుకు ఎనలేని ఉత్సాహంతో దొంగతనాల స్థాయిని పెంచాడు. దారి దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కోర్టులో అతను చేసిన దొంగతనాలు నిరూపించబడి ఇది అందరికీ తెలిసిన కథే… కాని, అన్ని తరాలవాళ్ళు తెలుసుకోవాల్సిన కథ… అనగనగా ఒక కొడుకు… ఒకరోజు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి తోటకూర దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చాడు. దొంగతనం తప్పని చెప్పాల్సిన తల్లి, కొడుకు తెచ్చిన తోటకూర చూసి మురిసిపోయింది. కొడుకును భలే పని చేసావంటూ పొగిడింది. దాంతో ఆ కొడుకు ఈసారి వంకాయలు దొంగలించి తెచ్చాడు. తల్లి మళ్ళీ అభినందించింది. కొడుకు ఎనలేని ఉత్సాహంతో దొంగతనాల స్థాయిని పెంచాడు. దారి దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కోర్టులో అతను చేసిన దొంగతనాలు నిరూపించబడి

జైలుశిక్ష వేసారు. పోలీసులు అతనిని జైలుకు తీసుకెళ్ళే ముందు తన తల్లిని చూడాలని కోరాడు. పోలీసులు అతని తల్లిని పిలిపించారు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతాడేమో అనుకుంటుండగా ఆ కొడుకు తన తల్లి చెంపమీద లాగికొట్టాడు. పోలీసులు నిర్ఘాంతపోయి, నీ తల్లిని ఎం దుకు కొట్టావు, ఆమె ఏం తప్పు చేసిందని అడిగారు. అప్పుడా కొడుకు… నేను ఈ రోజు జైలుకెళ్ళడానికి కారణం నా తల్లే. నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే ఇది తప్పు, ఇలా చేయకూడదు అని మంద లించి వుంటే ఈరోజు నేను దొంగగా కాకుండా మంచిపౌరుడిగా వుండేవాడిని అని చెప్పాడు.

ఇప్పుడు ఈ కథను ఎవరికి అన్వ యిద్దాం… పచ్చమీడియాకు, చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. 2014 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి జగన్‌ సొంత మీడియా కూడా! గాలివాటం సర్వేలు నిర్వహించి నూటపాతిక, నూట ముప్ఫై సీట్లు అంటూ ఊదరగొట్టారు. గుంటూరు నుండి శ్రీకాకుళం దాకా ఆ జిల్లాల్లో ఏం జరుగుతుంది, కుల సమీ కరణలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది అంచనా వేయకుండా గాలిలో మేడలు కట్టారు. జగన్‌ మీడియా లెక్కలు చూసి వైసిపి కేడర్‌ కూడా ఇంట్లో కూర్చున్నా గెలిచిపోతామనే భ్రమలో పడింది. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనిని వదిలేసారు. కాబట్టి వైసిపి ఓడిపోయింది.

మరిప్పుడు పచ్చమీడియా కూడా తోటకూర దొంగతనం కథలోని తల్లి పాత్రనే పోషిస్తోంది. చంద్రబాబు పాలన లోని లోపాలను ఎత్తి చూపుతూ పరిపా లనను సక్రమమైన దారిలో పెట్టించా ల్సిన పచ్చమీడియా ఆయన ఏ ప్రజావ్యతి రేక నిర్ణయాలు తీసుకున్నా తంధానా అంటూ చివరకు చంద్రబాబు చాప క్రిందకే నీళ్ళు తెస్తుంది.

మొన్న ఢిల్లీలో నీతి అయోగ్‌ సమా వేశం జరిగింది. దేశంలోని ముఖ్యమం త్రులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు సమావేశానికి వస్తారు. ఇది ఆనవాయితీ. వచ్చిన వీరం దరూ ప్రధానిని కలవడం, అభివాదం చేయడం మామూలే! నాయకుల మధ్య సైద్ధాంతిక పరమైన వైరం ఉంటుందేగాని వ్యక్తిగత వైరం ఉండదు కదా! కాని మొన్నటి నీతిఅయోగ్‌ సమావేశంలో చంద్రబాబు ఒక్కడి పాత్రే పెద్ద చర్చనీయాంశమైంది. మోడీ ముందు చంద్రబాబు 75డిగ్రీల కోణంలో వంగాడని, ఆయన ఎడమ చేత్తో చంద్రబాబుకు షేక్‌హ్యాండిచ్చాడని మీడి యాలో ఒకటే రచ్చ. చంద్రబాబుకు చేయి ఇచ్చింది ఎవరినేదానిపై కూడా ఒక పచ్చ ఛానెల్‌లో ప్రత్యేక చర్చ పెట్టారు. అసలు ‘నీతి అయోగ్‌’ సమావేశంలో ఏం జరిగిం దనే దానిపై ఇంత రచ్చ ఎందుకంటే దానికి కారణం చంద్రబాబుకు క్షణక్షణం బ్యాండ్‌ మేళం వాయించే ఒక మీడియానే! నీతి అయోగ్‌ సమావేశానికి ముందు రోజే ఈ పచ్చ పత్రికలలో, ఛానెల్స్‌లో చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నాడని, ఇక ఢిల్లీతో సమరమే నని, కత్తులతో కాదు కంటి చూపుతో కమలనాధుల ఫ్యాంట్లు తడిపేస్తాడని ఊదరగొట్టారు. నీతిఅయోగ్‌ సమావేశానికి, వీళ్ళు ప్రసారం చేసిన ‘సమరసింహారెడ్డి’ లాంటి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కాని పక్కరోజు ఆయన మోడీ ముందు బెండ్‌ అయిన ఫోటో బయటకు రావడంతో ‘ఇదేనా సమరం’ చేయడం అంటే అంటూ సోషల్‌ మీడియాలో తాట వలిచారు. ఏతావాతా ఆ మీడియా కథ నానికి భంగపడింది చంద్రబాబే!

ఈ ఒక్కటే కాదు… మొదటి నుండి ఈ పచ్చమీడియా బాబు అనుకూల శత్రువు గానే వ్యవహరిస్తోంది. 35వేల ఎకరాల మాగాణి భూములను నాశనం చేసి సింగ పూర్‌ లాంటి రాజధానిని కడతామన్న ప్పుడు… ఇది పద్ధతి కాదు బాబు, పం టలు పండే పొలాలను నాశనం చేయొద్దు అని ఈ పచ్చమీడియా హెచ్చరించి వుంటే ఈరోజు రాజధాని రైతుల్లో చంద్రబాబుపై వ్యతిరేకత వుండేది కాదు. పుష్కరాలకు ఇన్ని వేల కోట్లు తగలేయకూడదు అని చెప్పివుంటే రాష్ట్రంతో పాటు చంద్రబాబుకు మేలు చేసినవాళ్ళై వుండేవారు. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలు అంతగా ఎందుకు పెరిగాయని నిలదీసి వుంటే ఈరోజు కేంద్రం దృష్టిలో చంద్రబాబు అవినీతి పరుడై వుండేవాడు కాదు. తహశీల్దార్‌ వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుకలో ఈడ్చి కొట్టినప్పుడు ఇది తప్పు… ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాసుంటే చంద్రబాబుకు మంచి చేసినవాళ్ళై వుండేవారు. వైసిపికి చెందిన మొదటి ఎమ్మెల్యేను కొన్నప్పుడే ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు బాబూ అని పచ్చ మీడియా హితోపదేశం చేసుంటే ఆయన 23మంది ఎమ్మెల్యేలను కొనేదాకా పరిస్థితి వచ్చేది కాదు. ఇలా చంద్రబాబు చేసు కుంటూ వచ్చిన ఎన్నో తప్పులకు పచ్చ మీడియా వంతపాడడమే కాదు, ఆహో… ఓహో అద్భుతం అంటూ భజన చేసింది. చంద్రబాబు చేత తప్పుల మీద తప్పులు చేయించింది. రేపు ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే… అందులో సగానికిపైగా పాత్ర ఈ పచ్చమీడియాదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here