Home జిల్లా వార్తలు పక్షుల పండక్కి.. ముహూర్తం కుదిరింది

పక్షుల పండక్కి.. ముహూర్తం కుదిరింది

జనవరిలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తాయి. ఇవి తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల ప్రజలు చేసుకునే పండుగలు. కాని, అదే నెలలో నెల్లూరుజిల్లా వారికి మాత్రమే ప్రత్యేక పండుగ ఇం కోటి వుంది. అదే పక్షుల పండుగ. సూళ్లూరుపేట కేంద్రంగా జరిగే పండుగ. 2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌గా వున్న ప్రవీణ్‌కుమార్‌ ఈ పక్షుల పండుగను మొదలుపెట్టారు. అప్పటినుండి ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కూడా ప్రతి ఏడాది జనవరి నెలలో ఈ పక్షుల పండుగను ఒక ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. 2019 జనవరి నెలలో 17, 18, 19తేదీలలో పక్షుల పండుగను నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. దీనికి సంబం ధించిన ఏర్పాట్లపై మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ మంగళవారం అధికారులతో చర్చించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here