Home జిల్లా వార్తలు నెల్లూరు జిల్లాలో.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

నెల్లూరు జిల్లాలో.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

నెల్లూరుజిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకు 11వ తేదీ గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6గంటలకే ఓటర్లు బూత్‌ల వద్దకు పోటెత్తారు. ఓట్లు వేసేం దుకు ‘క్యూ’లలో బారులు తీరారు. యువత, మహిళలు, వృద్ధులు ఓటింగ్‌లో అత్యు త్సాహంతో పాల్గొనడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 23,92,210మంది ఓటర్లు వుండగా 16,52,510 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11వ తేదీ రాత్రి 8గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 69.08 శాతం పోలింగ్‌ నమోదు కాగా, సూళ్ళూరుపేట నియోజక వర్గంలో అత్యధికంగా 81.48శాతం, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అత్య ల్పంగా 59 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి పోలింగ్‌ శాతం ఇంకా తేలాల్సి వుంది. జిల్లాలో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. పోలీసులు వెనువెంటనే పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

జిల్లాలో నెల్లూరు పార్లమెంట్‌ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా బీద మస్తాన్‌రావు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చేవూరు దేవకుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా చండ్ర రాజగోపాల్‌లు బరిలో నిలవగా, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావుల మధ్యే ప్రధాన పోటీ నెలకొనివుంది. అలాగే తిరుపతి పార్లమెంట్‌ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పనబాక లక్ష్మి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్లి దుర్గాప్రసాద్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జిల్లాలోని నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలోనూ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తమ తమ నియోజకవర్గాలలో భారీగా పోలింగ్‌ పెరగడంతో గెలుపుపై ఎవరి ధీమాలో వాళ్ళున్నారు.

ె నెల్లూరు నగరం

నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏడుగంటల నుండే పోలింగ్‌బూత్‌లలో ఓటర్లు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయక ఓటర్లు ‘క్యూ’లలో నిలబడ్డారు. కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఆర్‌ స్కూల్‌ బూత్‌లో వైసిపి అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌పై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మిగతా అన్నిచోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా నడిచింది. తెలుగుదేశం అభ్యర్థి పి.నారాయణ, వైసిపి అభ్యర్థి అనిల్‌కుమార్‌లు అన్ని బూత్‌లు కల తిరుగుతూ పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు.

ె నెల్లూరు రూరల్‌

గ్రామీణ నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రశాంతంగానే జరిగింది. రూరల్‌ గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. నగర పరిధిలోని పోలింగ్‌బూత్‌లలోను ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్‌ ముగిసింది.

ె కోవూరు

చిన్నచిన్న గొడవలు తప్పితే మొత్తానికి పోలింగ్‌ బాగా జరిగింది. గ్రామాలలోని పోలింగ్‌బూత్‌లలో ఓటర్లు మెండుగా కనిపించారు. బయట ప్రాంతాలలో స్థిరపడిన వాళ్ళు సైతం ఈసారి అదిపనిగా వచ్చి నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైసిపి అభ్యర్థి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు.

ె కావలి

పోలింగ్‌ కంటే ముందే టెన్షన్‌ వాతావరణం నెలకొన్న నియోజకవర్గమిది. దీంతో పోలీసు అధికారులు ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగానే జరిగింది. వైసిపి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, టిడిపి అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ తిరిగారు.

ె ఉదయగిరి

నియోజకవర్గంలోని 8మండలాలలో పోలింగ్‌ ఎంతో బాగా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వలస ఓటర్లు ఈ ఎన్నికలకు నియోజకవర్గానికి భారీఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. వైసిపి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి అభ్యర్థి బొల్లినేని రామారావులు అన్ని మండలాలలో పోలింగ్‌బూత్‌లను పర్యవేక్షించారు.

ె ఆత్మకూరు

వైసిపి అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణక్రాకలో బొల్లినేని శీనయ్య ఏజెంట్‌గా కూర్చోగా వైసిపివాళ్ళు ఆయనను బయటకు పంపించారు. దీంతో బొల్లినేని కృష్ణయ్య స్వయంగా వచ్చి ఆ బూత్‌లో కూర్చోవడంతో వివాదం రేగింది. చేజర్ల మండలం పుళ్ళనీళ్ళపల్లెలో మేకపాటి గౌతంరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు.

ె వెంకటగిరి

పోలింగ్‌ ముమ్మరంగా జరిగింది. ఇరు పార్టీల అభ్యర్థులు కూడా వెంకటగిరి పట్టణంలో మెజార్టీ సాధించడంపై దృష్టి పెట్టారు. ఓటింగ్‌ ప్రక్రియ మొదలయ్యే గంట వరకు కూడా ఇరు పార్టీల అభ్యర్థుల ఓట్ల వేట సాగింది. వైసిపి అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.

ె గూడూరు

ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈవిఎంలు అక్కడక్కడా ఇబ్బంది పెట్టాయి. ఎక్కడా గొడవలు లేవు. వైసిపి అభ్యర్థి వరప్రసాద్‌, టిడిపి అభ్యర్థి పాశం సునీల్‌లు పోలింగ్‌ను పర్యవేక్షించారు.

ె సూళ్ళూరుపేట

ఏ గొడవలు లేకుండా ఎన్నికలు జరిగాయి. ఓటర్లు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వైసిపి అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, టిడిపి అభ్యర్థి పరసా రత్నంలు పోలింగ్‌బూత్‌లను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు పోలింగ్‌ను పర్యవేక్షించారు. టీడీపీ పెద్దగా పోటీలో లేకపోవడంతో ఓటింగ్‌ ఏకపక్షంగా నడిచింది.

ె సర్వేపల్లి

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఐదో అగ్ని పరీక్షకు సిద్ధమైన నియోజక వర్గమిది. అలాగే వైసిపి అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా రెండో గెలుపుకు తహతహలాడుతున్నారు. పోలింగ్‌ బాగా జరిగింది. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. పోటీ ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా నడిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here