Home నెల్లూరులో నేడు నెల్లూరుపై వరుణిడి చిన్నచూపు

నెల్లూరుపై వరుణిడి చిన్నచూపు

రాష్ట్రంలో గుంటూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా దాకా వర్షాలు పడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులతో పాటు ఈ జిల్లాల్లో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్నా నెల్లూరుజిల్లాలో మాత్రం వానల ఆనవాళ్ళు లేవు. అప్పుడప్పుడు తుప్పర్లు పడడం తప్పితే జడివానలు లేవు. పెన్నానది ప్రవహించి ఎన్నేళ్ళయ్యిందో! పెన్నలో నీటి ప్రవాహం సంగతే జనం మరచిపోయారు. గట్టిగా రెండురోజులు కూడా ముసురు పట్టడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి, సాగునీటి సమస్యలు యధాతధంగా వున్నాయి. కనీసం శ్రీశైలం డ్యాం నిండితేనన్నా సోమశిలకు నీళ్ళు వదులుతారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here