Home జిల్లా వార్తలు నెల్లూరుజిల్లా కొత్త ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి – ఇంటలిజెన్స్‌కు రామకృష్ణ

నెల్లూరుజిల్లా కొత్త ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి – ఇంటలిజెన్స్‌కు రామకృష్ణ

నెల్లూరుజిల్లాలో స్మగ్లర్లు, అరాచక శక్తులు, బెట్టింగ్‌ ముఠాలకు ఏడాది కాలంగా నిద్రలేకుండా చేసిన ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణను ప్రభుత్వం ఎట్టకేలకు ఇంటలిజెన్స్‌ ఎస్పీగా బదిలీ చేసింది. నెల్లూరుజిల్లా కొత్త ఎస్పీగా ఐశ్వర్య రస్తోగిని నియమించింది. ప్రస్తుతం ఆయన విశాఖ రూరల్‌ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నెల్లూరుకు బదిలీ అయ్యారు. విశాఖకు ముందు ఆయన అనంతపురం జిల్లా ఏఎస్పీగా కూడా పనిచేశారు.

ఎస్పీ రామకృష్ణ బదిలీతో అధికారపార్టీ నాయకులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కడప ఎస్పీగా వుంటూ ఏడాది క్రితం నెల్లూరుజిల్లాకు వచ్చిన రామకృష్ణ బెట్టింగ్‌లు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ద్వారా సంచలనానికి తెరలేపారు. అలాగే అక్రమ మైనింగ్‌ ఆట కట్టించి అధికార పార్టీ నేతలకు కూడా నిద్ర లేకుండా చేసాడు. రామకృష్ణను ఇక్కడనుండి బదిలీ చేయండని జిల్లా టీడీపీ నాయకులు చంద్రబాబును ఎప్పటినుండో కోరుతున్నారు. వారి ప్రయత్నం ఇప్పటికి ఫలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here