Home జిల్లా వార్తలు నెక్లెస్‌ పూర్తయ్యేనా..?

నెక్లెస్‌ పూర్తయ్యేనా..?

ఈనెల మూడో వారంలో నెల్లూరుజిల్లాలో ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు ఉండబోతున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నెక్లెస్‌రోడ్డును ఆయన చేత ప్రారంభింపచేయాలని తెలుగు దేశం నాయకులు భావిస్తున్నారు. అయితే నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శీనయ్య పగలు రాత్రులు అక్కడే వుండి తరుముతున్నా కూడా పనులు పూర్తయ్యేటట్లు లేవు. పూర్తికావడం కూడా అసాధ్యమే! ఇంకో మూడు నెలలకు గాని నెక్లెస్‌రోడ్డు పూర్తి రూపం సంత రించుకోదు. అయితే అయినకాడికి కానిచ్చి వెంకయ్య చేతులమీదుగా ఈ నెలలోనే నెక్లెస్‌రోడ్డును ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here