Home జిల్లా వార్తలు నీళ్ళను పొదుపుగా వాడుదాం

నీళ్ళను పొదుపుగా వాడుదాం

ఈ నెల 8వ తేదీన జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం నెల్లూరు కలెక్టరేట్‌లోని గోల్డెన్‌జూబ్లీ హాల్‌లో జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్‌కుమార్‌, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని, సోమశిలలో 42టిఎంసీలే అందుబాటులో వున్న దృష్ట్యా నీటి ఆవిరి, డెడ్‌ స్టోరేజ్‌ పోను 37 టీఎంసీలను వినియోగించుకునే అవకాశముంటుందని మంత్రి సోమిరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 3లక్షల 21వేల ఎకరాల మొదటి పంటకు నీళ్ళివ్వాలని నిర్ణయించారు. 9వ తేదీ నుండే నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. నీటి పొదుపుపై రైతులు శ్రద్ధ చూపాలని సోమిరెడ్డి కోరగా, నీటి పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ అధికారు లను హెచ్చరిం చారు. సమావేశంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇరిగేషన్‌ డ్రైన్స్‌ను నిబంధనల ప్రకారం నిర్మించాలంటూ మధ్యలో భైఠాయించారు. దీనిపై కమిటీ వేసి పరిష్కరిస్తామన్న కలెక్టర్‌ హామీతో ఆయన లేచారు. దామాషా ప్రకారం గూడూరు డివిజన్‌కు నీటి కేటాయింపులు జరపాలని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here