Home రాష్ట్రీయ వార్తలు నిప్పుకు… సుజనా తుప్పు

నిప్పుకు… సుజనా తుప్పు

కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోకి సిబిఐను నిషేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జి.ఓ జారీ చేసింది. దీనిమీద పెద్ద రాద్ధాంతమే జరిగింది. జాతీయ మీడియా చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడితే ఆంధ్రప్రదేశ్‌ పచ్చమీడియా మాత్రం చంద్రబాబు సిబిఐ తోకను కత్తిరించారంటూ సిబిఐను కుక్కతో పోలుస్తూ కార్టూన్‌లు వేసి శునకానందం పొందింది.

అయితే చంద్రబాబు సిబిఐ అంటే ఎందుకు వణికిపోతున్నాడో మొన్నటి ఆయన ప్రధాన అనుచరుడు, ఎంపి సుజనాచౌదరికి చెందిన కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ చేసిన దాడులతో తేటతెల్లమైంది. ఈడి చేసిన దాడులతోనే ఇంత అవినీతి భాగోతం బయటపడితే ఇక సిబిఐ రంగంలోకి దిగితే చంద్రబాబు సర్కార్‌ అవినీతి చిట్టా అంతా బయటకు తీయదా?

నిన్నటి సుజనాచౌదరి కంపెనీలపై ఈడీ దాడులతో నిప్పుగారి నిజాయితీకి తుప్పు పట్టినట్లయ్యింది. ఈ దాడులతో చంద్రబాబు బినామీ సుజనా అక్రమాలు బయటపడ్డాయి. 120కి పైగా బోగస్‌ కంపెనీలను నెలకొల్పిన ఆయన పలు బ్యాంకుల నుండి వాటి పేర్లతో 5700 కోట్లు అప్పులు తీసుకోవడం, అన్ని కంపెనీలకు ఒకే అడ్రస్‌ ఇవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్ళించడం, తన కంపెనీ ఉద్యోగులనే డైరక్టర్లుగా పెట్టడం వంటి అక్రమాలెన్నో వెలుగు చూశాయి. వీటిపై ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌ ఇంకా లోతుగా విచారణలోకి పోతోంది. సుజనాచౌదరి భాగోతం బయటపడ్డాక ఈయనను మరో విజయమాల్యాగా అభివర్ణిస్తున్నారు. కాని విజయ్‌మాల్యాతో సుజనాను పోల్చలేం. విజయ్‌మాల్యా దొంగ కంపెనీలు సృష్టించి బ్యాంకులను బురిడీ కొట్టించలేదు. వ్యాపార సంస్థల మీదే అప్పులు తీసుకున్నాడు. కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో తీవ్రంగా నష్టపోయి, అప్పులపాలై విదేశాలకు పారిపోయాడు. కాని, సుజనాచౌదరి ఉద్దేశ్యపూర్వకంగానే నకిలీ కంపెనీలను సృష్టించి వాటి పేరు మీదే వేలకోట్లు బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసినదే! బ్యాంకులు నుండి తెచ్చిన అప్పుల తోనే తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా బ్రతికించుకుంటూ వచ్చారు. ఈ డబ్బుల ఖర్చు వల్లే సుజనాచౌదరికి రాజ్యసభ రావడం అయినా కేంద్రంలో మంత్రి కావడం అయినా!

2014లో నరేంద్ర మోడీ తొలి కేబి నెట్‌లోనే అశోక్‌ గజపతిరాజుతో పాటు సుజనాచౌదరి పేరును కూడా చంద్రబాబు ఇచ్చారు. అయితే నరేంద్ర మోడీ సుజనా చౌదరి బ్యాంకులకు కట్టాల్సిన బకాయిల లిస్టు ఫైలును బాబు ముందుపెట్టారు. దాంతో సుజనాకు తొలివిడతలో బ్రేకు పడింది. బ్యాంకు వడ్డీ బకాయిలు చెల్లిం చాకే ఆయనను రెండో విడతలో మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. ఇటీవల కాలంలో ఈడి దొంగ కంపెనీలపై దాడులు పెంచింది. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న డొల్ల కంపెనీలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు డొల్ల కంపెనీల ద్వారానే వందలు, వేల కోట్లు అప్పులు తీసుకుని వున్నట్లు కేంద్రం గుర్తించింది. ఆ డొల్ల కంపెనీల భరతం పట్టేందుకే ఈడి దాడులు ముమ్మరం చేసింది. సుజనాచౌదరి కంపెనీలపై ఆ కోణంలోనే ఈడి దాడులు జరిగాయి.

ఐటి, సిబిఐ, ఈడి… ఇటీవల కాలంలో రాష్ట్రంలోని టిడిపి పెద్దతలకాయలపై వరుస దాడులు జరిగాయి. ఈ దాడుల తోనే చంద్రబాబు వెనుక ఎంత పెద్ద అవినీతి ముఠా ఉందో అర్ధమవుతోంది. తన ముఠాపై కేంద్రం దాడులు ముమ్మర మయ్యే సరికే… కేంద్రం లాగిన తీగ తన డొంకను ఎక్కడ కదిలిస్తుందోననే భయంతో చంద్రబాబు మోడీపై యుద్ధమంటూ అన్ని పార్టీల ఆఫీసుల తలుపులు తడుతున్నాడు.

గత ఆరేళ్ళుగా జగన్‌ను ఈ తెలుగు దేశం నాయకులు అదే పనిగా ఆడిపోసు కుంటున్నారు. గోరంతను కొండంతలుగా ప్రచారం చేశారు. కాని, జగన్‌ అన్నింటిని కూడా చట్టపరిధిలోనే ఎదుర్కొన్నాడు. జగన్‌పై లక్షకోట్లు అని చేసిన ఆరోపణలన్నీ కూడా ఒక్కొక్కటిగా తేలిపోయాయి. లక్ష పోయి వేలు, వేలు పోయి వందల కోట్ల లోకి వచ్చింది. రేపు ఆ కేసు కూడా నిలు స్తుందన్న నమ్మకం లేదు.

జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఒక్కొ క్కటిగా వీగిపోయే కొద్ది చంద్రబాబు తెర వెనుక వున్నోళ్ళు ఒక్కొక్కరుగా బయట కొస్తున్నారు. అవినీతి కేసుల్లో చిక్కుకుం టున్నారు. అందుకే జగన్‌ మొదట నుండి అంటున్నాడు… అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని. ఇప్పుడు ఆ దేవుడే అన్ని నిజాలను బయటపెట్టిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here