Home జిల్లా వార్తలు నా ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

నా ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

కావలి – సీతారాంపురం జాతీయ రహదారి ప్రతిపాదనను 2011లో తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడు కేంద్రానికి పంపించడం జరిగిందిని, ఆ ప్రతిపాదనను నేటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఉదయగిరి మాజీశాసనసభ్యుడు, ఉదయగిరి వైకాపా ఇన్‌ఛార్జ్‌ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపాడు. ఈరోజు(24.09.18) విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఏర్పేడు-మార్కాపురం జాతీయ రహదారి వచ్చిందని, ఈ రహదారి వల్ల ఉదయగిరి ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయని చెప్పాడు. కావలి – సీతారాంపురం జాతీయ రహదారి మంజూరులో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్రమేయం ఏమీ లేకపోయినా, ఇది నా ఘనతేనంటూ ఆయన డప్పు కొట్టుకుని, ర్యాలీలు జరుపుకోవడం విచిత్రంగా వుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తి అవినీతిమయమైందని, ప్రతి పథకంలోనూ కోట్ల దోపిడీ చోటు చేసుకుంటోందని, ఉదయగిరిలోనూ నీరు-చెట్టు, పసుపు కుంభకోణం ఎమ్మెల్యే అవినీతి కార్యక్రమాలకు పరాకాష్టగా నిలుస్తాయన్నాడు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడాన్ని ఖండిస్తూ ఆయన మరణం పాపం కూడా తెలుగుదేశందేనన్నారు. వైసిపి నుంచి గెలిచిన ఆయనను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి తీసుకువెళ్లారని, ఆయనకు మైనింగ్‌ అనుమతులు ఇప్పించి మావోయిస్టుల దృష్టిలో పడేలా చేసారని శేఖర్‌రెడ్డి ఆరోపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here