Home జాతీయ వార్తలు నాకు తిరుగులేదు

నాకు తిరుగులేదు

భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) నమ్మకానికి అమ్మలాంటిది పిఎస్‌ఎల్‌వి సిరీస్‌. పిఎస్‌ఎల్‌వి అంటే విజయాలకు, విశ్వాసానికి చిరునామాగా మారింది. పిఎస్‌ఎల్‌వి రాకెట్‌లను ప్రయో గించేటప్పుడు గతంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో టెన్షన్‌ పడేవాళ్ళు. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో వదిలేదాకా ఊపిరి బిగపట్టి ఎదురుచూసేవాళ్ళు. ఇప్పుడు పిఎస్‌ఎల్‌వి అంత టెన్షన్‌ పెట్టడం లేదు. లాంచ్‌ ప్యాడ్‌ మీద నుండి పైకి లేచిందంటే ఇక కక్ష్యలో ఉపగ్రహాలను వదిలిపెట్టినట్లే! అంత పక్కా నమ్మకస్థురాలిగా మారింది పిఎస్‌ఎల్‌వి. ఇస్రో తనపై పెట్టిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంది పిఎస్‌ఎల్‌వి. ఈనెల 16వ తేదీ రాత్రి 10.08 గంటలకు శ్రీహరికోట లోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి42 విజయవంతమైంది. రాత్రి సమ యంలో ప్రయోగం కావడంతో చీకట్లను చీల్చుకుంటూ ఆకాశానికి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి-సి42 రాకెట్‌ దృశ్యం అద్భు తంగా ఆవిష్కృతమైంది. మొత్తం 17.44 నిమిషాలలో ప్రయోగం పూర్తయ్యింది. నిర్ణీత వ్యవధిలో 889 కిలోల బరువుగల రెండు విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో శాస్త్రవేత్తలు అలాగే బ్రిటన్‌కు చెందిన ప్రతినిధులు ఒకరికొకరు అభినం దనలు తెలుపుకున్నారు.

ప్రయోగం అనంతరం బ్రహ్మప్రకాశ్‌ హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరిలో పిఎస్‌ఎల్‌వి-సి43ని ప్రయో గించనున్నట్లు చెప్పారు. త్వరలో జిఎస్‌ ఎల్‌వి-మార్క్‌3 డి2 ప్రయోగం వుంటుం దని వెల్లడించారు. ఐదు టన్నుల బరువు గల జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ఏరియల్‌ స్పేస్‌ ఏజన్సీ నుండి పంపనున్నట్లు తెలి పారు. 2019 జనవరి 3 – ఫిబ్రవరి 16ల మధ్య చంద్రయాన్‌-2 ప్రయోగం వుంటుందని ఆయన పేర్కొన్నారు. పిఎస్‌ ఎల్‌వి-సి42 ద్వారా పంపిన నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాల ద్వారా ఇస్రో వాణిజ్య సంస్థ యాంత్రిక్స్‌కు 220కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇస్రో త్వరలో జీశాట్‌-29, జీశాట్‌-11, జీశాట్‌-20, జీశాట్‌-19 ఉపగ్రహాలను పంపనుందని, వీటిద్వారా ఇంటర్నెట్‌ సేవలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను బట్టి మూడో ప్రయోగవేదికను ఏర్పాటు చేయాల్సి వుంటుందని, దీనిపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here