Home రాష్ట్రీయ వార్తలు నందమూరి వారసురాలనిపించింది

నందమూరి వారసురాలనిపించింది

తెలంగాణ ఎన్నికల్లో ప్రతి తెలుగువాడు ఆసక్తిగా ఎదురుచూసిన నియోజకవర్గం కూకట్ పల్లి. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండే ఆ నియోజకవర్గంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఆమె ఓటమి మాత్రం ఎవ్వరూ ఊహించి వుండరు. అది కూడా అంత దారుణంగా. ఫలితాలు వెలువడే రోజు సుహాసిని సగంలోనే వెళ్లిపోయారు. అయితే వారం తర్వాత మళ్ళీ సుహాసిని తెరపైకి వచ్చి… గెలుపోటములు సహజమని, అయితే ఈ ఎన్నికల్లో చాలా వరకు ఓట్లు గల్లంతయ్యాయని, ఏదేమైనా తన తరపున ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తనకు సాయపడ్డ ప్రతిఒక్కరికీ ఆమె తన కృతగ్నతలు తెలుపుకుని నందమూరి వారసురాలనిపించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here