Home రాష్ట్రీయ వార్తలు దొరలే డేటా దొంగలా?

దొరలే డేటా దొంగలా?

భారతదేశ రాజకీయ చరిత్రలో నాటి నెహ్రూ నుండి నిన్నటి వై.యస్‌. రాజశేఖరరెడ్డి వరకు ఎందరో నాయ కులు ఎన్నికల్లో తమ పార్టీలను ముందుకు నడిపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం రాజమార్గాలనే ఎంచు కున్నారు. ప్రజలకు తాము చేసినవి చెప్పుకున్నారు… చేయాలనుకుంటున్నది వివరించారు. వారి నాయక త్వాలను ప్రజలు అంగీకరిస్తే, వారి పరిపాలనను ఆద రిస్తే మళ్ళీ అధికారంలో కూర్చున్నారు. తిరస్కరిస్తే ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ అధినేతల లక్షణం అది. ప్రజలను మెప్పించ గలిగితే విజయం దానంతట అదే వస్తుంది. ప్రజల్ని మెప్పించకుండా నొప్పించినప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవ డానికి కూడా సిద్ధపడాలి.

కాని దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల కనీస ధర్మాన్ని విడిచిపెట్టేసింది తెలుగుదేశం పార్టీ! ప్రజల మెప్పు పొంది వారి ఓట్ల ద్వారా గెలవడం కంటే కూడా వారి ఓట్లను తొలగించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా కుయుక్తులు పన్నింది. ప్రజాస్వామ్య దేశంలో ఎంతో విలువైన ఓటు హక్కులను ప్రజల నుండే తస్కరించే దుర్మార్గపు చర్యకు ఒడిగట్టారు కొందరు ప్రబుద్ధులు. తమ పార్టీని, తమ పాలనకు వ్యతిరేకంగా వున్న వారిని సైతం మెప్పిం చేలా పాలన చేసి వారి ఓట్లను కూడా రాబట్టుకునే ప్రయత్నం చేయాల్సిన పార్టీ నాయకత్వం ఈ రాజమార్గాన్ని వదిలేసి తమ పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను పూర్తిగా ఓటర్ల జాబితా నుండే తొలగించారు. తద్వారా 2019 ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారిని ఎంచుకున్నారు.

దాదాపు రెండేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం వుంది. రాష్ట్రంలోని అందరి సెల్‌ఫోన్‌లకు ఒక కాల్‌ వస్తుంటుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటని మొబైల్‌ వినియోగ దారుడిని అడుగుతారు. పనితీరు బాగుం దంటే ‘1’ నొక్కండి, పర్వాలేదు అనుకుంటే ‘2’ నొక్కండి… అసలు బాగాలేదు అను కుంటే ‘3’ నొక్కండి అనే రికార్డర్‌ వాయిస్‌ వినిపిస్తుంది. పొరపాటున ఎవరైన ‘3’ బటన్‌ నొక్కారా… అతని ఓటు గల్లంతై నట్లే! ఎందుకంటే ఎట్టి పరిస్థితులలోనూ అతను తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యడు. కాబట్టి ఓటర్ల జాబితా నుండి తొలగిం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 56లక్షల ఓట్లు గల్లంతైనట్లు సమాచారం. టెలికాలర్‌ వాయిస్‌లో టిడిపి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారం దరి ఓట్లు పోతున్నాయన్నది నిన్నటి వరకు పుకారు మాత్రమే అనుకోగా, హైదరాబాద్‌ కేంద్రంగా మొన్న వెలుగుచూసిన ఏపి ఓటర్ల డేటా చోరీ సంఘటనతో ఇది నిజ మేననే సంగతి లోకానికి వెల్లడైంది.

పెద్దల వ్యూహమే!

రాష్ట్ర ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వుంది. మళ్ళీ ఎన్నికల్లో టిడిపి గెలవడం కష్టమని సర్వేలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి పెద్దలు అడ్డదారిని ఎంచుకున్నారు. హైదరాబాద్‌కు ఐటిని తీసుకొచ్చింది నేనే అని పదేపదే చెప్పుకునే చంద్రబాబు అదే ఐటిని బాగా ఉపయోగించుకున్నారు. కొంతకాలం క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధికార సర్వే నిర్వ హించింది. ప్రతిఒక్కరి ఆధార్‌, ఓటర్‌ కార్డు, బ్యాంకు ఖాతా, వాళ్ళు పొందే పథకాల వివరాలను ఈ సర్వే ద్వారా సేకరించారు. అందరి మొబైల్‌ నెంబర్లు తీసుకున్నారు. ఈ డేటా అంతా కూడా ప్రభుత్వం వద్ద భద్రంగా వుండాలి. ఐ.టి శాఖ దీనికి బాధ్యతగా వ్యవహరించాలి.

అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ డేటాను సేకరించారో ఆ లక్ష్యాన్ని నెర వేర్చుకోవడానికి తెలుగుదేశం నాయకులు శ్రీకారం చుట్టారు. డాకవరపు అశోక్‌ అనే ఐ.టి నిపుణుడు, తెలుగుదేశం సానుభూతి పరుడు నెలకొల్పిన ఐ.టి గ్రిడ్‌ అనే సంస్థకు ఈ డేటానంతా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఈ సంస్థ టిడిపి సేవామిత్ర అనే యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ ద్వారా ప్రభు త్వంపై ప్రజల అభిప్రాయాలు తెలుసు కోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న వారి వివరాలను ఆయా జిల్లాలకు పంపి, అక్కడ తమకు అనుకూలురైన అధికారుల ద్వారా ఓటర్ల జాబితా నుండి వారి ఓట్లు తొలగించడం చేస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో ఓటర్ల జాబితాలో తమ ఓట్లు లేవని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ కూడా మళ్ళీ ఓట్లు నమోదు చేసుకోండంటూ ప్రజలకు సూచిస్తుందేగాని, ఇన్ని లక్షల ఓట్లు ఎలా గల్లంతయ్యాయనే విషయంపై దృష్టి పెట్టలేకపోయింది. అయితే హైదరా బాద్‌లో వుంటున్న లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసులు రంగంలో దిగడం, ఐటి గ్రిడ్‌, బ్లూఫ్రాగ్‌ కంపెనీలపై దాడులు చేయడంతో డేటా చోరీ విషయమంతా వెలుగులోకి వచ్చింది.

నిందితుడు అశోక్‌ది నెల్లూరే!

ఐ.టి గ్రిడ్‌ వ్యవస్థాపకుడు, డేటా చోరీలో ప్రధాన నిందితుడైన డాకవరపు అశోక్‌ది నెల్లూరుజిల్లా అల్లూరు మండలం. కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన అశోక్‌ కొంత కాలం బెంగుళూరులో పని చేశాడు. ఆ తర్వాత ఐ.టి మంత్రి లోకేష్‌తో పరిచయం ఏర్పడి హైదరాబాద్‌ కేంద్రంగా ఐటి గ్రిడ్‌ సంస్థను స్థాపించాడు. డేటా చోరీ, ఓట్ల తొలగింపుకు సంబంధించి భారీ మొత్తానికే అతను కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నట్లు తెలు స్తోంది. హైదరాబాద్‌ నుండి పారిపోయిన అశోక్‌ ప్రస్తుతం ఏపిలో పోలీసుల రక్షణలో తలదాచుకుంటున్నట్లు సమాచారం. అశోక్‌ విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు.

చంద్రబాబు పాత పాట!

హైదరాబాద్‌ కేంద్రంగా సైబర్‌ క్రైం చోటు చేసుకుంది. ఫిర్యాదిదారుడు హైదరాబాదీ… చోరీకి పాల్పడ్డ సంస్థ

ఉండేది కూడా హైదరాబాద్‌లోనే! కాబట్టి తెలంగాణ పోలీసులే ఈ కేసు విచారణ చేపడుతారు. మనం కొన్న బంగారం విజయవాడలో కళ్యాణ్‌ జ్యూయలర్స్‌లోది అయినా హైదరాబాద్‌లో పోగొట్టుకుంటే… విచారణ జరగాల్సింది కూడా అక్కడే కదా! డేటా చోరీ కేసు కూడా ఇలాంటిదే! అయితే ఈ కేసులో తమ మూలాలు ఎక్కడ బయట పడతాయోనని నాయకులు భయపడుతు న్నారు. తమ వైఫల్యాలను ఆంధ్రుల ఆత్మగౌరవానికి చుట్టే చంద్రబాబు, ఈ సంఘటనకు కూడా అదే కలరింగ్‌ ఇచ్చాడు. దీనిని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య యుద్ధంగా మలచాలని చూస్తున్నాడు. గతంలో ఓటు-నోటు కేసు, తెలంంగాణ ఎన్నికల అంశాన్ని కూడా ఆయన అదే విధంగా చేశాడు.

ఎన్నికల సంఘం రంగంలోకి దిగాలి!

ఈ కేసు విషయంపై ఎన్నికల సంఘం గట్టిగా దృష్టి సారించాలి. ఏపి ప్రజల డేటా చోరీ నిందితులు ఎంతటివారైనా వదలకూడదు. అదే సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు తడకలను పూర్తిగా సంస్కరించి, అందరి ఓట్లు పొందుపరి చాకే రాష్ట్రంలో ఎన్నికల యుద్ధానికి పచ్చజెండా ఊపాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here