Home జిల్లా వార్తలు ‘దేశం’ నేతల్లో కలతలు రేపుతున్న… గ్రామీణ పంచాయితీ

‘దేశం’ నేతల్లో కలతలు రేపుతున్న… గ్రామీణ పంచాయితీ

మొన్నటిదాకా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనే దానిపై జిల్లా తెలుగుదేశంపార్టీలో పంచాయితీ నడిచింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డిని మొదలుకొని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి… చివరగా మేయర్‌ అజీజ్‌ వరకు అందరిపేర్లను తిప్పారు. టిక్కెట్‌ ఎవరిదనే సంగతి పక్కనపెడితే ఇప్పుడు ‘రూరల్‌’పై పెత్తనం విషయంలో తెలుగు దేశం నాయకుల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి.

ఇటీవల వరకు ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోనే గ్రామీణ నియోజకవర్గంలో కార్యకలాపాలు సాగుతూ వచ్చాయి. కాగా, ఆదాల రూరల్‌ సీటు తనకే కావాలని అడగకపోతుం డడంతో మిగతావాళ్ళు కూడా రూరల్‌ కార్యకలాపాలలో తల దూరుస్తున్నారు. ఈ మధ్య ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రమేయం లేకుండానే మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌లు కొన్ని కార్య క్రమాలు చేపట్టడం ఆదాల వర్గంలో అసంతృప్తి కలిగించింది. మంత్రి నారాయణ రూరల్‌ అభ్యర్థిగా ఆదాల దిగకపోతే తన మనిషిగా మేయర్‌ అజీజ్‌ను దింపాలని భావిస్తున్నాడు. ఆ విధంగా ఆయన రూరల్‌లో అజీజ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాడు. నెల్లూరు రూరల్‌లో కొంత పట్టున్న మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కూడా ఆదాల కాదన్న పక్షంలో తన అనుచరుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్‌ దక్కించుకోవాలనుకుంటున్నాడు. తాజాగా, నెల్లూరురూరల్‌ అభ్యర్థిని నిర్ణయించడంలో మా అభిప్రాయం కూడా తీసుకోవాలంటూ కిలారి వెంకటస్వామి నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కొందరు మొన్న నెల్లూలోని ఓ హోటల్‌లో మీటింగ్‌ పెట్టారు. ఇది కూడా పార్టీలో కలకలం రేపుతోంది.

నెల్లూరురూరల్‌ సీటు నుండి నేనే పోటీ చేస్తానని ఆదాల అంటే ఇంత గందరగోళం వుండదు. ఆయన పక్క నియోజక వర్గాల వైపు చూస్తుండబట్టే నెల్లూరురూరల్‌లో తమ ఆధిపత్యం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here