Home రాష్ట్రీయ వార్తలు దేశం గుండెల్లో కత్తిపోటు

దేశం గుండెల్లో కత్తిపోటు

పబ్లిసిటి స్టంట్‌ అన్న ముద్రవేసి మూత పెట్టి కప్పేయాలనుకున్న ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసు విషయమై చంద్రబాబు చెప్పిన కథలనే పోలీసులు కూడా అప్పజెబుతూ వచ్చారు. వాళ్ళ నుండి ఈ మాత్రం నేర విచారణ వూహించిందే కాబట్టి వైసిపి నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోలేదు. ఈ కేసు వెనుక దాగున్న కుట్ర కోణాన్ని వెలుగులోకి తెస్తారని ఒక్క శాతం కూడా అనుకోలేదు. వాళ్ళు కోరుతున్నదల్లా ఈ కేసు విచారణ థర్డ్‌ పార్టీ చేత చేయించమని!

హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు జగన్‌పై హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్ప గించింది. ఈ కేసు విచారణ ఎన్‌ఐఏకు అప్పగించడంతోటే తెలుగుదేశం నాయ కుల్లో గుండె దడ మొదలైంది. వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లు ఆంధ్రరాష్ట్రంపై కక్షగట్టే కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించిందంటూ శోకండాలు పెడుతున్నారు. ఎన్‌ఐఏ అడిగిన సమాచారాన్ని ఇవ్వడానికి కూడా ఏపి పోలీసులు నిరాకరిస్తుంటే ఈ కేసు వెనుక వెలుగు చూడాల్సిన నిజాలు ఎన్నో ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్‌ఐఏ గట్టిగా దృష్టి పెడితే జగన్‌పై హత్యాయత్నం కేసులో అసలు కోణాన్ని గురించి తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here