Home గల్పిక దేశం కోసం తిరుమలలోనే ఉండిపోవాలనుకున్న రాహుల్‌

దేశం కోసం తిరుమలలోనే ఉండిపోవాలనుకున్న రాహుల్‌

ఢిల్లీలోని టెన్‌ జనపథ్‌… సోనియా గాంధీ ఒకటే టెన్షన్‌తో అటు ఇటు తిరుగుతోంది. పక్కన అహ్మద్‌పటేల్‌, గులాంనబీ ఆజాద్‌, అంబికాసోని, పనబాక లక్ష్మిలలోనూ టెన్షన్‌ కనిపిస్తోంది. విహెచ్‌ హనుమంతురావు ట్రేలో టీ కప్పు లతో వచ్చి… పొద్దున నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మ గారు మీరు… ఇలా వుంటే ఎలాగమ్మా అని అడిగాడు. రాహుల్‌బాబు కనిపిం చేంతవరకు మంచినీళ్ళు తాగను హను మాన్‌జీ అని సోనియా చెప్పింది. అట్లా గయితే ఈ టీ అన్నా తాగండమ్మా అంటూ టీ కప్పు చేతికిచ్చాడు. టీకైతే ఒకే అంటూ ఆమె టీ తాగసాగింది. అప్పుడే అక్కడకు వచ్చిన మల్లిఖార్జున ఖర్గే… ఎందుకు మేడం అంత టెన్షన్‌గా వున్నారని పనబాక లక్ష్మిని అడిగాడు. దానికామె… రాహుల్‌బాబు తిరుపతికి వెళుతున్నానని చెప్పి మొన్న అనగా వెళ్లాడు. అప్పటినుండి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో, ఏమో అని మేడం దిగులు పెట్టుకుంది అని చెప్పింది. అందుకు ఖర్గే… అతనేం పసిపిల్లోడు కాదుకదా మేడం, ప్రపంచం చుట్టిన వీరుడు. రేపు భారతదేశాన్ని పాలిం చాల్సిన నాయకుడు. ఎక్కడకూ పోడులే అని సముదాయించాడు. దానికి అహ్మద్‌ పటేల్‌… మేడమ్‌ భయం అది కాదు, తిరుపతికి వెళ్లాక తిరుమలకు మెట్లెక్కి కాలినడకన పోతానని చెప్పాడట… మోకాలి పర్వతం ఎక్కేటప్పుడు ఎక్కడ మోచిప్పలు అరిగిపోతాయో… అసలే పెళ్లికానోడు అనేది మేడమ్‌ భయం అని చెప్పాడు. అప్పుడు ఖర్గే… మనం ఇక్కడ కూర్చుని టెన్షన్‌ పడడం దేనికి… ఆ తిరుపతి, తిరుమల కొండల్లోనే రాహుల్‌ కోసం వెదుకుతాం పదండి అని చెప్పాడు. అంతలో మధుయాష్కీ పరు గెత్తుకుంటూ వచ్చి ‘ఈనాడు’ పత్రిక వారి ముందు పెట్టాడు. ‘కాలి నడకన తిరు మలకు రాహుల్‌’. ‘గంటా 48 నిముషాల రికార్డ్‌ టైంలో తిరుమలకు చేరుకున్న మొదటి వ్యక్తి’… అని న్యూస్‌ వుంది. ఆ వార్త చూసి సోనియా షాక్‌ తింది. వీడు నిజంగానే మోకాళ్లు పోగొట్టుకునేటట్లు న్నాడు. వీడికి ఇక పిల్లనెవరిస్తారు దేవుడా అని ఏడవసాగింది. అంబికాసోని ఆమెను ఓదారుస్తూ… ముందు రాహుల్‌ ఎక్కడ వున్నాడో వెదుకుతాం పదండి… అంటూ అందరినీ లేవదీసింది.

్య్య్య్య్య

స్పెషల్‌ ఫ్లైట్‌లో సోనియా బ్యాచ్‌ అంతా తిరుపతి ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడనుండి కార్లలో అలిపిరి వద్దకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో రాహుల్‌ను వెదుక్కుంటూ కొండెక్కసాగారు. కొండెక్కే భక్తులందరూ ‘గోవింద గోవింద’ అని అరుస్తుంటే సోనియా బృందం మాత్రం ‘రాహుల్‌ రాహుల్‌…’ అంటూ ఎక్క సాగింది. వీళ్ళ అరుపులు విని… పక్క నున్న భక్తులు ఈమధ్య వెంకటేశ్వరస్వామి పేరును ‘రాహుల్‌’ అని మార్చారా ఏంటి… మనం అది తెలుసుకోక పాత పేరుతోనే ‘గోవింద’ అని పిలుస్తున్నామా అని అయోమయంలో పడ్డారు. వీళ్లెవరో పెద్దమనుషులు, బాగా చదువుకున్నోళ్లు లాగుంది. ఖచ్చితంగా గోవిందుడి పేరును రాహుల్‌గా మార్చబట్టే రాహుల్‌… రాహుల్‌ అని అరుస్తున్నారు. మనం కూడా అదే పేరును స్మరిస్తే పోలేదా అనుకుంటూ వారి వెనుక ముందు వుండే భక్తులు కూడా ‘రాహుల్‌ రాహుల్‌’ అంటూ పిలవసాగారు. ఆ పిలుపులు విని సోనియా… రాహుల్‌ కోసం ఇంత మంది వెదుకుతున్నారా… అని మనసులో అనుకుంది. అలా అరుచుకుంటూ అందరూ కొండపైకి చేరుకున్నారు. అన్ని సందుల్లో, అన్ని రోడ్లలో, అన్ని హోటల్స్‌, అన్ని దుకాణాల వద్ద రాహుల్‌ కోసం వెదకసాగారు. ఎక్కడా కనిపించలేదు. అందరికీ బాగా ఆకలేస్తుండడంతో ‘తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం’లోకి వెళ్ళారు. అందరూ ఒకే వరు సలో కూర్చున్నారు. శ్రీవారి సేవకులు అందరికీ అరిటాకులు వేసి అన్నప్రసాదం వడ్డించారు. భక్తులంతా తింటున్నారు. సేవకులు కూరలు వడ్డిస్తున్నారు. అంతలో సోనియా బృందం వెనుక బెంచీలో నుండి… బాబూ కొంచెం ‘పప్పు’ వడ్డించు అనే మాట వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లుండడంతో పనబాక లక్ష్మి భోజనం దగ్గర నుండి లేచి ఆ వైపుకు వెళ్లి చూసింది. అంతే పెద్దగా… మేడమ్‌ మన పప్పు దొరికాడు అని నోరుజారి… సారీ, మన రాహుల్‌ దొరికాడు అని కేకేసింది. భోజనాలు చేస్తున్నవాళ్ళు ఒక్క ఉదుటన లేచి అక్కడికి వెళ్లారు. రాహుల్‌గాంధీ భక్తుల వరుసలో కూర్చుని శుభ్రంగా తింటున్నాడు. సోనియా వుండి… ఏంటి రాహుల్‌, ఒక్కరోజు పర్యటనకని ఇక్కడకు వచ్చి, ఇక్కడే వుండిపోయావని అడిగింది. దానికి రాహుల్‌… ఒక్కరోజు అనే వచ్చా నమ్మా, కాని నాకు రోజూ ఇక్కడే వుండా లనిపిస్తోంది. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా వుంది. శుభ్రంగా పప్పు వేసి భోజనం పెడుతున్నారు. శ్రీవారి కీర్తనలు, భజనలతో మనసు ప్రశాంతంగా వుంది. నేను ఇక్కడే వుం టాను అని చెప్పాడు. సోనియా వుండి… అయినా గంటా యాభై నిముషాలలో కొండెలా ఎక్కావు. మోకాళ్ల పర్వతం ఎక్కినప్పుడు మోకాళ్ళు నొప్పులు రాలేదా అని అడిగింది. దానికి రాహుల్‌… తిరుమల ఘాట్‌ ప్రయాణంలో మోకాళ్ళ పర్వతం స్కిప్‌ చేసానమ్మా, ఆ ఒక్క చోట కారులో వెళ్లాను అని చెప్పాడు. వెరీగుడ్‌ రాహుల్‌… మన కుటుంబం పదవుల్లోకి వచ్చింది కూడా ఇలాగే అని చెప్పి… ఇక ఢిల్లీకి పోదాం పదమ్మా, అక్కడ చాలా పని వుంది అని సోనియా అంది. అందుకు రాహుల్‌… లేదమ్మా, నేను ఇక్కడే వుంటానమ్మా, నేను తిరుమలలో స్వామి సేవ చేస్తుంటే దేశం ప్రశాం తంగా వుంటుందని మొన్న ఇక్కడే కని పించిన ఒక స్వామీజీ చెప్పాడు. దేశం కోసం, దేశ ప్రజల సుఖసంతోషాల కోసం నేను ఇక్కడే వుంటానమ్మా అని అన్నాడు. అందుకు సోనియా… అయ్యో పిచ్చినా తండ్రీ!… అతనెవరో బీజేపీ స్వామి అయ్యుంటాడు… బీజేపీ వాళ్లే అలా చెప్పించి వుంటారు. నువ్విక్కడే వుండి పోతే ఆ బీజేపీ వాళ్లకు అడ్డం వుండదు. మళ్లీ మోడీ పీఎం అయితే దేశం ప్రశాం తంగానే వుంటుంది. కాకపోతే మాకే మనశ్శాంతి వుండదు. దేశం సుఖం, దేశం శాంతి అనే పిచ్చి మాటలు మాని ఢిల్లీకి పోదాం పద అంటూ చేయి పట్టుకుని ఈడ్చుకుపోసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here