Home జిల్లా వార్తలు ‘దేశం’తో.. అనుబంధాన్ని వదులుకున్న ‘బల్లి’

‘దేశం’తో.. అనుబంధాన్ని వదులుకున్న ‘బల్లి’

జిల్లా తెలుగుదేశంపార్టీలో 1983 బ్యాచ్‌ నాయ కుల్లో గూడూరు మాజీఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు ఒకడు. రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో స్థిరమైన నాయ కుడిగా పేరు తెచ్చుకున్నాడు. పార్టీలో చంద్రబాబుకంటే కూడా సీనియర్‌. ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. గూడూరు టిక్కెట్‌ ఈసారి కూడా ఆయనకు రాకపోవడంతో ఇక ఆ పార్టీలో ఉం డలేక రాజీనామా లేఖ పంపాడు. బల్లి 1983 నుండి పార్టీలో వున్నాడు. 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఎన్నికల్లో గూడూరు రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడు. 4 దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2014లలో ఆయనకు సీటు రాలేదు. ఈసారి గూడూరు సీటును పాశం సునీల్‌కు కేటాయించడంతో ఇక అక్కడ తనకు స్థానం లేదనుకుని తెలుగుదేశంతో వున్న తన సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here