Home జిల్లా వార్తలు దీపావళి మోతెక్కేనా?

దీపావళి మోతెక్కేనా?

ఓపక్క సుప్రీం కోర్టేమో దీపావళి నాడు టపాకాయలు ఇన్ని గంటలు మాత్రమే కాల్చాలంటూ ఆంక్షలు విధించింది. ఇంకోపక్క పదినెలలుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఉక్కపోతలో ముంచెత్తిన ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గి చిరుజల్లులు మొదలవుతున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 7న దీపావళి. ఇప్పటికే జిల్లాలో చిరుజల్లులు మొదలయ్యాయి. మరోపక్క జిఎస్టీ దెబ్బతో టపాకాయల ధరలు ఆకాశచువ్వలకంటే ముందే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు దీపావళి పండుగను ఎంత వరకు చేసుకుంటారో, అసలు వ్యాపారులకు ఈ దీపావళి ఏ మాత్రం లాభాలు తెస్తుందో చూడాలి!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here